×
Ad

VISA – Vintara Saradaga : ‘VISA – వింటారా సరదాగా’ నుంచి ‘అన‌గా అన‌గా అమెరికా’ సాంగ్..

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'VISA - వింటారా సరదాగా'

AnagaAnagaAmerica Lyrical from VISA Vintara Saradaga movie

VISA – Vintara Saradaga : అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘VISA – వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాకి మైండ్‌ బ్లోయింగ్‌ డీల్!

రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి పాట‌ను విడుద‌ల చేశారు. ‘అనగా అనగా అమెరికా.. కథ మొదలిక.. మది గదులని తెరువగా..’ అంటూ ఈ పాట సాగుతోంది. సనారె సాహిత్యాన్ని అందించ‌గా విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. సంజిత్ హెగ్డే పాడారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.