Anakapalli : ‘అనకాపల్లి’ నుంచి ఈ మెలోడీ సాంగ్ విన్నారా? నాగవంశీ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్..
మీరు కూడా ఈ పాటను వినేయండి..(Anakapalli)
Anakapalli
Anakapalli : భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్స్ పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాని నిర్మించడమే కాక కథ, స్క్రీన్ ప్లే అందించి సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ఓ రొమాంటిక్, ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌ను విడుదల చేసారు. నిర్మాత నాగవంశీ ఎలగే పిల్ల.. అంటూ సాగే ఈ మెలడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. దేవజండ్ సంగీత దర్శకత్వంలో అనంత్ శ్రీరామ్ ఈ పాట రాయగా కపిల్ కపిలాన్, దేవజండ్ కలిసి ఈ పాటను పాడారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..
నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ పాటను రిలీజ్ చేసి.. పాట క్యాచీగా ఉందని, విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని మూవీ యూనిట్ అని అభినందించారు.

