Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie Collects 50 Crores collections in just one week
Baby Movie Collections : SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడమే కాక స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్, నటులు బేబీ సినిమాని అభినందించారు. ఇటీవలే అల్లు అర్జున్ స్వయంగా సినిమా చూసి బేబీ సినిమాని అభినందించడానికి ప్రత్యేకంగా ఈవెంట్ కూడా పెట్టాడు.
ఈ సినిమాకి యూత్ ముఖ్యంగా కనెక్ట్ అవుతున్నారు. లవ్ ఫెయిల్యూర్ పర్సన్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో బేబీ సినిమాకు రీచ్ బాగా పెరిగింది. బేబీ సినిమాకు మొదటి రోజే ఏకంగా 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వచ్చాయి. బేబీ సినిమా రిలీజయి వారం రోజులైంది. వారం రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు కలెక్ట్ చేసింది. ఇక ఎనిమిది రోజుల్లోనే 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది.
చిన్న, మీడియం సినిమాలు 50 కోట్లు కలెక్ట్ చేయడమంటే మాములు విషయం కాదు. అలాంటిది వారం రోజుల్లోనే కలెక్ట్ చేసి చిన్న, మీడియం సినిమాల్లో అత్యంత వేగంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా బేబీ నిలిచింది. దాదాపు ఈ సినిమాకి 25 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సినిమా బ్రేక్ ఈవెన్ కేవలం 8 కోట్లే. దీంతో ఇప్పటికే సినిమాకు 17 కోట్ల లాభాలు వచ్చాయి. చిత్రయూనిట్ మాత్రం బేబీ సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉంది. తాజాగా సక్సెస్ టూర్స్ మొదలుపెట్టింది. నేడు జులై 22న కడప, తిరుపతిలలోని పలు థియేటర్స్ ని బేబీ యూనిట్ సందర్శించనున్నారు.
Fastest 50 crore Gross in Mid Range films ♥️ pic.twitter.com/dTXbmNRlkV
— Sai Rajesh (@sairazesh) July 21, 2023