Baby Collections : ‘బేబీ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. చిన్న సినిమాకి ఈ రేంజ్ లోనా.. పెట్టిన బడ్జెట్ మొదటి రోజే వచ్చేసిందిగా..

ఈ సినిమాలో స్టార్ హీరోస్ ఎవరూ లేకపోయినా, చిన్న సినిమా అయినా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. బేబీ సినిమా మొదటి రోజు ఏకంగా............

Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie First Day Collections

Baby Movie Collections :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేయగా పాజిటివ్ టాక్స్ వచ్చాయి. సినిమా మంచి విజయం సాధించింది.

బేబీ సినిమాకు ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. యూత్ లవ్ లో చూసే సమస్యలని, ముఖ్యంగా అబ్బాయిలు చూసే రియల్ సన్నివేశాలని, బ్రేకప్ లని చూపిస్తూ ఈ సినిమాకి తెరకెక్కించారని ప్రేక్షకులు అంటున్నారు. సినిమా సాంగ్స్, ట్రైలర్ బాగా హిట్ అవ్వడంతో సినిమాపై ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీంతో మొదటి రోజు ప్రేక్షకులు భారీగా వచ్చారు. సినిమాలో చాలా సన్నివేశాలు బాగున్నాయని, హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ మాత్రం చాలా బాగా నటించారని అంటున్నారు.

Jaanavule Song : బ్రో సినిమా నుంచి ‘జాణవులే’ సాంగ్ వచ్చేసింది..

ఈ సినిమాలో స్టార్ హీరోస్ ఎవరూ లేకపోయినా, చిన్న సినిమా అయినా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. బేబీ సినిమా మొదటి రోజు ఏకంగా 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 4 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమాకి పెట్టిన బడ్జెట్ మొదటి రోజే వచ్చేసిందని సమాచారం. ఇక శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా బేబీ చిత్రయూనిట్ థ్యాంక్యూ మీట్ కూడా నిర్వహించారు.