Epic : ఆనంద్, వైష్ణవి ‘ఎపిక్’ నుంచి అదిరిపోయే సాంగ్ వచ్చేసింది.. పాట వైబ్ మాములుగా లేదుగా..

మీరు కూడా ఈ ఎపిక్ సినిమా సాంగ్ వినేయండి.. (Epic)

  • Published on- September 1, 2026 / 04:30 PM IST

Epic Song

Epic : శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎపిక్. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి సబ్‌కో.. అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేసారు. ఈ పాటను హేశం అబ్దుల్ వహద్ సంగీత దర్శకత్వంలో శ్రీ హర్ష ఈమని రాయగా సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ పాడారు. ఈ సాంగ్ లండన్ కి వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మధ్య ఫ్రెండ్షిప్, ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Also Read : Palnati Surya Pratap : మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’.. వెబ్ సిరీస్ తో రాబోతున్న కుమారి 21F దర్శకుడు..

మీరు కూడా ఈ ఎపిక్ సినిమా సాంగ్ వినేయండి..