Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమాను చూడకుండా ఎలా ఉండగలను.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
తాజాగా ఆనంద్ మహీంద్రా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను చూడకుండా ఎలా ఉండగలను అంటూ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది..............
- Saketh U
- Published On : May 30, 2022 / 07:03 AM IST
Mahesh Babu
Anand Mahindra : మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. దేశంలోని పలు ఆసక్తికర విషయాలకి స్పందిస్తూ ఉంటారు. అంతే కాక సేవ చేయడంలో కూడా ముందుండి ఎంతోమంది అవసరం ఉన్నవారికి సేవ చేస్తున్నారు ఆనంద్ మహీంద్రా. ఇటీవలే తన కంపెనీ నుంచి ప్రభాస్ ప్రాజెక్టు K సినిమాకి వాహనాలను అందివ్వడానికి రెడీ అయి టాలీవుడ్ లో భాగం కూడా అయ్యారు. తాజాగా ఆనంద్ మహీంద్రా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను చూడకుండా ఎలా ఉండగలను అంటూ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించి రెండు వారాల్లోనే 200 కోట్ల గ్రాస్ సాధించిన రీజనల్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు జవా మోటార్స్ కి చెందిన బైక్ ని వాడాడు. సినిమాలోని బైక్ సీన్స్ ని కొన్నిటిని జవా మోటార్స్ అధినేతల్లో ఒకరైన అనుపమ్ తరేజా ట్విట్టర్ లో పోస్ట్ చేసి మహేష్ ని, ఆ బైక్ ని పొగుడుతూ ట్వీట్ చేశాడు.
Kerala : స్టేజిపై పాట పాడుతూ కుప్పకూలిపోయి మరణించిన సింగర్
జవా మోటార్స్ మహీంద్రా గ్రూప్ కావడంతో ఈ ట్వీట్ కి స్పందించాడు ఆనంద్ మహీంద్రా. అనుపమ్ తరేజా పోస్ట్ చేసిన మహేష్ బాబు వీడియోను షేర్ చేసి.. ”అన్‌బీటబుల్ కాంబినేషన్ అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, జవా మెరూన్‌లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. న్యూజెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శిస్తే అక్కడికి వెళ్లి చూస్తాను” అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ని మరింత వైరల్ చేస్తున్నారు.
How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1
— anand mahindra (@anandmahindra) May 29, 2022
