Tantra Trailer : భయపెట్టడానికి రాబోతున్న అనన్య నాగళ్ళ.. ‘తంత్ర’ ట్రైలర్ చూశారా..?
హారర్ ఎలిమెంట్స్ కంటెంట్ తో అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి మెయిన్ లీడ్స్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న 'తంత్ర' ట్రైలర్ చూశారా?
- gum 95921
- Published On : February 29, 2024 / 03:47 PM IST
Ananya Nagalla Horror Film Tantra Trailer Released
Tantra Trailer : అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి మెయిన్ లీడ్స్ లో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా తంత్ర. తాంత్రిక శాస్త్రం, హారర్ ఎలిమెంట్స్ కంటెంట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి భయపెట్టగా తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం కొత్తగా ఉంది.. అనన్యకు మాత్రమే ఓ జుట్టు విరబోసుకొని ఓ పాప కనపడే సీన్ తో ట్రైలర్ మొదలవుతుంది. రామాయణ యుద్ధంలో క్షుద్ర పూజలు గురించి, వాటిని లక్ష్మణుడు ఎలా ఆపాడు అని ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పించారు. అలాగే అనన్య, ధనుష్ క్యారెక్టర్స్ మధ్య ప్రేమతో పాటు అనన్య పై క్షుద్ర పూజలు చేస్తే ఏం జరిగింది అన్నట్టు ట్రైలర్ లో చూపించారు.
Also read : Singer Chinmayi : సింగర్ చిన్మయి పై పోలీసు కేసు నమోదు చేసిన విద్యార్థి.. ఎందుకంటే..!
https://youtu.be/DQISJrXu_iA
ఈ ట్రైలర్ తో తంత్ర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ‘తంత్ర’ చాలా డిఫరెంట్ మూవీ. నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. ఇన్నాళ్లు వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అన్నారు, ఇప్పుడు తంత్ర అనన్య అని పిలుస్తారు అని తెలిపింది. ఇక ఈ హారర్ థ్రిల్లింగ్ సినిమా మార్చి 15న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
