Ananya Panday Birthday Celebrations in Maldives with Boy Friend Aditya Roy Kapoor
Ananya Panday : బాలీవుడ్(Bollywood) భామ అనన్య పాండే ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా నిన్న అక్టోబర్ 30న అనన్య పాండే పుట్టిన రోజు కావడంతో మాల్దీవ్స్ కి చెక్కేసి అక్కడే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
Also Read : Sri Divya : తెలుగు హీరోయిన్ త్వరలో లవ్ మ్యారేజ్..?
మాల్దీవ్స్(Maldives) లో అనన్య పాండే తన బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే మాల్దీవ్స్ కి తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapoor) కూడా వెళ్లినట్టు సమాచారం. ముంబై విమానాశ్రమంలో ఇద్దరూ మాల్దీవ్స్ కి వెళ్లేముందు మీడియాకు చిక్కారు. దీంతో అనన్య తన ప్రియుడు ఆదిత్యతోనే మాల్దీవ్స్ కి వెళ్లిందని, బాయ్ ఫ్రెండ్ తో బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పలుమార్లు వీరిద్దరూ విదేశాల్లో చక్కర్లు కొడుతూ మీడియా కంట పడ్డారు. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.