Ananya Pandey: ఒక్క సినిమాతోనే కెరీర్‌కు ఫుల్‌స్టాప్.. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదుగా!

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో ఆమె కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిపోయింది.

Ananya Pandey Tollyood Career Ended Up With Only One Movie

Ananya Pandey: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, ఈ సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని అనన్యా ఆశించింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌ను వేరే లెవెల్‌లో చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావించింది.

Ananya Pandey: హాట్ ఫోటోలతో బాప్ రే అనిపిస్తున్న అనన్య పాండే!

అయితే, ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం అమ్మడి ఆశలు ఆవిరయ్యాయి. లైగర్ మూవీ కథలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్న అనన్యాకు ఈ సినిమా తీవ్ర నష్టం చేసింది. లైగర్ మూవీతో టాలీవుడ్‌లో జెండా పాతుదామని చూసిన ఈ బ్యూటీని, ఇప్పుడు పట్టించుకునే వారు లేరు. లైగర్ మూవీ తరువాత అనన్యాకు టాలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. బాలీవుడ్ బ్యూటీల కోసం తెలుగు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అయినా కూడా వారెవరూ అనన్యా వైపు చూడటం లేదు.

Ananya Pandey : రష్మిక పాటకు దుబాయ్‌లో స్టెప్పులేస్తున్న లైగర్ భామ..

బాలీవుడ్‌లో కియారా అద్వానీ, జాన్వీ కపూర్ వంటి మిగతా హీరోయిన్లను ఏరికోరి తెచ్చుకుంటున్నారు. అనన్యాకు లైగర్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో ఆమె కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిపోయింది. ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీకి అక్కడ ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాలి.