“అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు’’ అంటున్న అనసూయ..

Anasuya Bharadwaj: ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో గుర్తింపు తెచ్చకున్న యంగ్ హీరో కార్తికేయ, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. కార్తికేయ ఫస్ట్ టైమ్ ‘బస్తీ బాలరాజు’ అనే మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. లావణ్య నర్స్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన‘‘చావు కబురు చల్లగా’’ టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో స్టార్ యాంకర్, టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ కూడా కనిపించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనసూయ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. సాంగ్ మేకింగ్‌లో నుండి అనసూయ విజువల్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగుంది. ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.