KTR – Anasuya Bharadwaj : ‘చెప్పండి సార్.. ఇదెక్కడి న్యాయం’?

యాంకర్ అనసూయ.. మినిస్టర్ కేటీఆర్‌కు చేసిన ట్వీట్స్ వైరల్..

KTR – Anasuya Bharadwaj : ‘చెప్పండి సార్.. ఇదెక్కడి న్యాయం’?

Ktr Anasuya Bharadwaj

Updated On : October 29, 2021 / 4:41 PM IST

KTR – Anasuya Bharadwaj: యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ.. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. తనను ట్రోల్ చేసే వారికి ఘాటుగా రిప్లై ఇవ్వడంతో పాటు సొసైటీలో జరిగే బర్నింగ్ ఇష్యూలపై రెస్పాండ్ అవుతూ ఉంటుంది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..

ఇప్పుడామె మినిస్టర్ కెటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవడమే కాక చర్చనీయాంశంగా మారాయి. స్కూళ్లలో చిన్న పిల్లల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులపై ఒత్తిడి, వారి బాధ్యత ప్రభుత్వానిదేనంటూ అనసూయ ట్వీట్ చేసింది.

Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..

‘కేటీఆర్ సార్ నాకో డౌట్.. కరోనా కారణంగా మనం లాక్‌డౌన్ ఫాలో అయ్యాం. దేశ వ్యాప్తంగా కేసులు తగ్గుతుండడంతో లాక్‌‌డౌన్ తీసేశారు. అలాగే మన దేశంలో వ్యాక్సినేషన్ కూడా స్పీడ్‌గా కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకోని చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? స్కూల్స్‌లో పిల్లలకు ఏం జరిగినా తమ బాధ్యత కాదని, అందుకు సంబంధించి తల్లిదండ్రులు ముందుగా ఓ అంగీకార పత్రాన్ని తప్పకుండా ఇవ్వాలని యాజమాన్యం ఎందుకు ఒత్తిడి తెస్తుంది.. చెప్పండి సార్.. ఇదెక్కడి న్యాయం’ అంటూ అనసూయ ట్వీట్స్ చేసింది.