×
Ad

Anasuya Tattoos : అనసూయ ఒంటిపై ఉన్న టాటూలు.. వాటి మీనింగ్స్ ఇవే అంట..

తాజాగా అనసూయ చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ఓ ఇద్దరు నెటిజన్లు అనసూయ టాటూల గురించి అడిగారు.

  • Published On : October 4, 2023 / 09:39 AM IST

Anasuya Tattoos Placing on her Body and that tattoos meanings goes viral

Anasuya Tattoos :  యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. యాంకర్ గా బిజీగా ఉన్నా, సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తుండటంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి వరుసగా సినిమాలు చేస్తుంది. ఇటీవలే పెదకాపు 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో అక్కమ్మ పాత్రలో మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన పోస్టులతో, తన హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవుతూనే ఉంటుంది.

తాజాగా అనసూయ చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ఓ ఇద్దరు నెటిజన్లు అనసూయ టాటూల గురించి అడిగారు. అనసూయ లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక టాటూ, ఎద పైభాగంలో ఒక టాటూ ఉంటుంది. ఎదపై నిక్కు అని, చేతిపై కేలన్ అని టాటూలు ఉంటాయి. వీటి గురించి అడగడంతో వాటి అర్దాలు చెప్పింది అనసూయ.

Also Read : Samantha : సమంత కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది..? ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తున్న నెటిజన్లు..

అనసూయ తన టాటూల గురించి చెప్తూ.. నా ఒంటి మీద రెండు టాటూలు ఉన్నాయి. ఒకటి నిక్కు అని ఉంటుంది. అది నేను మా ఆయన్ని ముద్దుగా పిలిచే పేరు. మా ఫస్ట్ నిశ్చితార్థం యానివర్సరీ, మా ఆయన బర్త్ డే ఒకేసారి రావడంతో మా ఆయనకు సర్ ప్రైజ్ గా ఆ టాటూ వేయించుకున్నాను. ఇంకోటి నా చేతిమీద కేలన్ అని ఉంటుంది. కేలన్ అంటే గ్రీకు భాషలో క్యారెక్టర్ బ్యూటీ అని అర్ధం అంటూ తెలిపింది. దీంతో అనసూయ టాటూలు ఇప్పుడు వైరల్ గా మారాయి.