Samantha : సమంత కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది..? ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తున్న నెటిజన్లు..
ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగ చైతన్యని కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్క చైతన్య వద్దకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు అది సమంత కుక్క అని గుర్తుపట్టేసి తెగ కామెంట్స్ చేస్తున్నారు.
![Samantha : సమంత కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది..? ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తున్న నెటిజన్లు.. Samantha : సమంత కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది..? ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తున్న నెటిజన్లు..](https://10tv.in/wp-content/uploads/2023/10/samantha-1.jpg)
Samantha Pet Dog Hash Appeared at Naga Chaitanya Video goes Viral
Samantha Dog : సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసిటిస్ చికిత్స అని చెప్పి దేశాలు తిరిగేస్తుంది. ఇక నాగ చైతన్య(Naga Chaitanya) తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ విడిపోయి ఎన్నాళ్లయినా వీళ్ళ పెయిర్ ఎప్పటికి హాట్ టాపిక్కే. రోజూ ఎవరో ఒకరు సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి సమంత, నాగ చైతన్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అందుకు కారణం సమంత పెంపుడు కుక్క హాష్(Hash).
సమంత దగ్గర హాష్, శాష్ అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్న సంగతి తెలిసిందే. హాష్ ఎప్పట్నుంచో సమంత, చైతన్య కలిసి ఉన్నప్పటి నుంచి ఉంది. ఆ కుక్క సమంత, చైతు ఇద్దరి దగ్గర క్లోజ్ గా ఉండేది. వీళ్ళు విడిపోయాక సమంత ఆ కుక్కని తనతో పాటు తెచ్చేసుకుంది. పలు సార్లు తన సోషల్ మీడియాలో తన కుక్కతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే సమంత, చైతన్య విడిపోయిన తర్వాత తాజాగా హాష్ కుక్క మొదటిసారి నాగ చైతన్య దగ్గర కనపడింది.
Also Read : Kushboo Sundar : ఆ ఆలయంలో మహిళలకు పూజలు.. ఈసారి నటి కుష్బూకి పూజలు చేసిన పూజారులు..
ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగ చైతన్యని కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్క చైతన్య వద్దకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు అది సమంత కుక్క అని గుర్తుపట్టేసి తెగ కామెంట్స్ చేస్తున్నారు. సమంత కుక్క చైతన్య దగ్గర ఎందుకు ఉంది? హాష్ మళ్ళీ చైతు దగ్గరికి వచ్చేసిందా? లేదా సమంత విదేశాలకు వెళ్లే ముందు కుక్కల్ని చైతన్య దగ్గర వదిలేసి వెళ్లిందా? అంటే వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారా?… ఇలా అనేక రకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
అయితే సమంత కొన్నాళ్లపాటు విదేశాలకు వెళ్ళింది కాబట్టి హాష్ చైతన్యకు క్లోజ్ కాబట్టి చైతన్య దగ్గర వదిలేసి వెళ్లినట్టు సమాచారం. మొత్తానికి ఒక కుక్క వల్ల మళ్ళీ సమంత, నాగచైతన్య వైరల్ గా మారారు. ఇక వీళ్లిద్దరి కామన్ అభిమానులు అయితే ఆ కుక్క వల్ల అయినా మళ్ళీ వాళ్ళు కలిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.
Hash Chay daggara undenti🙄
— New Soul (@Gen_Movie_buff) October 2, 2023
Good to see hash
— Satgish (@ursprince1234) October 2, 2023
Hash Sam tho untundha or Chay tho untundha
— 😎 (@Agent_akhil) October 2, 2023
@PurnaMaaya_ e hash kukka manodi daggara undhenti bro
— Sagar_nc (@nc_sagar) October 2, 2023