Anasuya : అసలు అన్ని వదిలేస్తాను అని మళ్ళీ ట్వీట్ చేసిన అనసూయ.. నా పేరు లేకుండా ఏం జరగదా అంటూ ట్వీట్..

అసలు ఎలాంటి సందర్భం లేకుండానే తనే ఏదో ట్వీట్ చేసేసింది. కనీసం అది ఎందుకు చేసింది, ఎవరి కోసం చేసింది కూడా చెప్పలేదు. దీంతో మరోసారి అనసూయ వైరల్ గా మారింది.

Anasuya tweet goes viral what happened to again her vijay fans trolling

Anasuya Tweet :  అనసూయ తన సినిమాలు, షోల కంటే కూడా వివాదాలు, ట్వీట్స్ తోనే ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి సమయం నుంచి అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ ఎప్పుడో ఈ గొడవని వదిలేసినా అనసూయ మాత్రం ఏదో ఒక సమయంలో ఏదో ఒక ట్వీట్ చేసి విజయ్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ ఉండేది. దీంతో అనసూయపై విజయ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేసేవారు. అయితే ఇటీవల దీని గురించి స్పందిస్తూ ఇక ఈ విషయాన్నీ వదిలేస్తాను, సోషల్ మీడియాలో ఇలాంటివాటిపై ట్వీట్స్ పెట్టను, నాకు మనశ్శాంతి కావాలి అని వ్యాఖ్యలు చేసింది.

ఈ వ్యాఖ్యలు చేసి నెల రోజులు కూడా కాలేదు మళ్ళీ ఓ ట్వీట్ చేసి అనసూయ వైరల్ అవుతుంది. ఈ సారి అనసూయ.. వావ్.. నేను అందరికి చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా, నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంటే మీ అందరికి నేను చాలా అవసరం. నా మీద అంత డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏది చేయలేకపోతున్నారు అని ట్వీట్ చేసింది.

Dancer Membership : టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ మెంబర్ షిప్ కావాలా? అయితే ఈ ఆడిషన్స్‌కి వెళ్లాల్సిందే..

ఇప్పుడు అసలు ఎలాంటి సందర్భం లేకుండానే తనే ఏదో ట్వీట్ చేసేసింది. కనీసం అది ఎందుకు చేసింది, ఎవరి కోసం చేసింది కూడా చెప్పలేదు. దీంతో మరోసారి అనసూయ వైరల్ గా మారింది. అసలు ఇలాంటి ట్వీట్స్ చేయను అని మళ్ళీ మొదలుపెట్టడంతో మరోసారి అనసూయపై ట్రోల్స్ చేస్తూనే ఈ ట్వీట్ ఎవరికోసం అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అందరూ ఆనంద్ దేవరకొండని అనసూయ, విజయ్ వివాదం గురించి అడిగారు. దాని కోసమే అనసూయ ఈ ట్వీట్ చేసిందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాని అనసూయ ఈ అర్ధం కాని ట్వీట్ ఎందుకు చేసిందో తనకే తెలియాలి మరి.