డైరెక్టర్‌తో రొమాన్సా?

రుణ్ భాస్కర్ సినిమాలో అనసూయ.

  • Publish Date - January 31, 2019 / 12:09 PM IST

రుణ్ భాస్కర్ సినిమాలో అనసూయ.

స్మాల్ స్ర్కీన్‌పైనే కాకుండా, సిల్వర్ స్ర్కీన్‌పై కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనసూయ భరద్వాజ్. క్షణం, గూడాఛారి సినిమాలలో అనసూయ చేసిన క్యారెక్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఎఫ్2లోనూ తెరపై తళుక్కుమంది. ఇంతకీ  అనసూయ డైరెక్టర్‌తో రొమాన్స్ చెయ్యడం ఏంటీ అనుకుంటున్నారా? పెళ్ళిచూపులు, ఈ నగరానికేమైంది సినిమాలతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. హీరోగా తనకి బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ కోసం, విజయ్ దేవరకొండ ఈ సినిమాతో  నిర్మాతగా మారుతున్నాడు.

తరుణ్ భాస్కర్ పక్కన అనసూయ హీరోయిన్‌గా నటించనుందనీ, ఆమెది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనీ, రొమాన్స్ కాస్త గట్టిగానే ఉంటుందనీ రకరకాల వార్తలు వస్తున్నాయి.. రీసెంట్‌గా ఆ వార్తల గురించి  స్పందించింది అనసూయ. నేను తరుణ్ భాస్కర్ సినిమాలో నటిస్తున్న మాట నిజమే.. కానీ, అందరూ అనుకుంటున్నట్టు అది రొమాంటిక్ రోల్ అయితే కాదు.. నా సినీ కెరీర్‌కి ప్లస్ అయ్యే క్యారెక్టర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను… అని క్లారిటీ ఇచ్చింది… అనసూయ లీడ్ క్యారెక్టర్ చేసిన కథనం త్వరలో రిలీజ్ కానుంది.