×
Ad

Anasuya: మా బాడీ.. మా ఇష్టం.. శివాజీ కామెంట్స్ కి అనసూయ కౌంటర్

నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వాటిపై యాంకర్ అనసూయ(Anasuya) కూడా తనదైన స్టయిల్లో శివాజీకి కౌంటర్ ఇచ్చింది.

Anchor Anasuya give a solid counter to actor Shivaji.

Anasuya: టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ఆయన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఆయన సినిమా గురించి మాట్లాడుతూ చివర్లో ఆడవాళ్ళ, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్సులు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. “స్త్రీ అంటే ప్రకృతి. అది ఎంత అందంగా ఉంటే అంత గౌరవం. స్త్రీ అందం అనేది చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా పొట్టి పొట్టి బట్టల్లో సామాన్లు కనిపించేలా గౌరవం ఉండదు. బయటకు బాగుంది అని చెప్పినా.. లోపల అసహ్యించుకుంటారు అని చెప్పుకొచ్చాడు. మధ్యలో కొన్ని అసభ్యకరమైన పదాలు కూడా వాడాడు.

Nellore Neeraja: మీకు కామెడీ ఎందుకు.. క్యాటరింగ్ చేసుకోండి అంటూ.. ఆ జబర్దస్త్ కమెడియన్ చాలా అవమానించాడు..

దాంతో, శివాజీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి శివాజీకి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. భారతీయ సంస్కృతీ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు మెట్టెలు వేసుకొని తిరుగు అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ(Anasuya) కూడా తనదైన స్టయిల్లో శివాజీకి కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇది మా బాడీ.. మీది కాదు” అని రాసుకొచ్చింది. మాకు నచ్చినట్టుగా బట్టలే వేసుకునే స్వేచ్ఛ మాకు ఉంది అనే అర్థం వచ్చేలా ఒక ఇమేజ్ కూడా యాడ్ చేసింది.

దీంతో అనసూయ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా శివాజీపై నెగిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. బట్టలు అనేది ఎవరి ఛాయిస్ వారిది. ఎవరికీ నచ్చినట్టుగా బట్టలు వేసుకునే హక్కు వారికి ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నాయి. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేక శివాజీ మళ్ళీ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.