Nellore Neeraja: మీకు కామెడీ ఎందుకు.. క్యాటరింగ్ చేసుకోండి అంటూ.. ఆ జబర్దస్త్ కమెడియన్ చాలా అవమానించాడు..

జబర్దస్ కామెడీ షో చాలా మంది అప్కామింగ్ కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది .వారిలో నెల్లూరు నీరజ(Nellore Neeraja) ఒకరు.

Nellore Neeraja: మీకు కామెడీ ఎందుకు.. క్యాటరింగ్ చేసుకోండి అంటూ.. ఆ జబర్దస్త్ కమెడియన్ చాలా అవమానించాడు..

Nellore Neeraja emotional comments about the insult she faced from Jabardasth team leader

Updated On : December 23, 2025 / 1:55 PM IST

Nellore Neeraja: జబర్దస్ కామెడీ షో చాలా మంది అప్కామింగ్ కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో పాల్గొన్నవారు ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారిలో నెల్లూరు నీరజ(Nellore Neeraja) ఒకరు. జబర్దస్త్ కన్నా ముందు నీరజ చాలా కామెడీ స్కిట్లు చేసింది. మంచి ఫేమ్ కూడా సంపాదించింది. ఆ ఫేమ్ తోనే జబర్దస్త్ లో అవకాశం దక్కించుకుంది. పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లైఫ్ గురించి, అవకాశాల కోసం పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

Mounika Reddy: గోల్డ్ కలర్ డ్రెస్సులో మౌనిక రెడ్డి మెరుపులు.. ఫోటోలు

ఇందులో భాగంగానే ఒక జబర్దస్త్ టీం లీడర్ తనను అవమానించి నట్టుగా చెప్పుకొచ్చింది నీరజ. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..”నాకు చాలా కాలం ఎదురుచూపులా తరువాత జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ఒకే టీం లీడర్ దగ్గర చేస్తూ వచ్చాను. అలాగే మాకు క్యాటరింగ్ బిజినెస్ కూడా ఉంది. కానీ, ఒకసారి జబర్దస్త్ షూట్ ఉన్న టైంలోనే క్యాటరింగ్ లో మంచి ఆఫర్ వచ్చింది. జబర్దస్త్ కి వెళ్ళడానికి కుదరలేదు. దానికి ఆ టీం లీడర్ కాల్ చేసి.. మీరు కామెడి షోలు ఎందుకు.. క్యాటరింగ్ చేసుకోండి. అంటూ అవమానకరంగా మాట్లాడాడు.

ఆ మాటలు విన్నాక చాలా బాధేసింది. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది నెల్లూరు నీరజ. ఇక తనకు జబర్దస్త్ లో చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాకెట్ రాఘవ అని కూడా చెప్పింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె ఎవరి గురించి చెప్పింది అనేది కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి సమాధానం ఆమె జబర్దస్త్ లో చేసిన స్కిట్లు చూస్తే అర్థం అవుతుంది.