Gayatri Bhargavi : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన గాయత్రి భార్గవి..

తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు పోలీసులను ఆశ్రయించారు గాయత్రి..

Gayatri Bhargavi

Gayatri Bhargavi: గాయత్రి భార్గవి.. యాంకర్‌‌గా కెరీర్ స్టార్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్, సినిమాల్లో తన స్టైల్ పర్ఫార్మెన్స్‌తో అలరించారామె. రీసెంట్‌గా తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు పోలీసులను ఆశ్రయించారు గాయత్రి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలకు, ఆడియెన్స్‌కు మధ్య దూరం తగ్గిపోయింది. వీటి పుణ్యమా అని నెటిజన్లు సెలబ్రిటీలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఉపయోగం ఎంత ఉందో దాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే అనర్థాలు కూడా అనేకం అనే సంఘటనలు చాలానే చూశాం.

ఇప్పుడలాంటి ఘటనే జరిగింది.. గాయత్రి భార్గవి ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యింది. ఎఫ్బీ పేజీతో పాటు తన అకౌంట్ కూడా హ్యాక్ అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ తెలిపారు.