Site icon 10TV Telugu

Anchor Ravi : దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.. అందుకే వాళ్ళ మీద కేస్ పెట్టాను..

Anchor Ravi Gives Clarity about File a Case Trollers Regarding Bigg Boss

Anchor Ravi

Anchor Ravi : యాంకర్ రవి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లో రవి దాదాపు 12 వారల వరకు ఉన్నాడు. రవిపై వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసారు. ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వీడియోలు చేసారు. దాంతో యాంకర్ రవి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంలో పోలీసులకు కంప్లైంట్ చేసాడు.

తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యాంకర్ రవి కేసు పెట్టడంపై స్పందిస్తూ.. బిగ్ బాస్ లోపలికి వెళ్లకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అది ఒక షో. రైటర్స్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. దాని గురించి ఏం తెలియకుండా గంట ఎపిసోడ్ చూసి రివ్యూలు చెప్తారు. పోనీ అక్కడిదాకా ఆపితే ఓకే. పర్సనల్ లైఫ్ ఎందుకు. బిగ్ బాస్ అనేది మనం ఆడే ఆట కాదు. బయట మన ఫ్యామిలీ ఆడే అట. వాళ్ళు బయట మనల్ని ఎలా ప్రమోట్ చేస్తారు, దానికి ఎంత కష్టపడ్డారు అనేది కూడా ముఖ్యం.

Also Read : Upendra Kumar : భార్యతో కలిసి కన్నడ స్టార్ ఉపేంద్ర వరలక్ష్మి వ్రతం పూజలు..ఫొటోలు..

వాళ్లకు ఒక ట్రామా లాంటింది. నేను లోపల ఏం చేసానో నాకు తెలుసు. బయట వాళ్ళు పది రకాలుగా అంటారు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. ప్రతి వాళ్లకు సమాధానం చెప్పలేను. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. కొంతమంది ఆ లిమిట్ దాటారు. నా ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శలు చేసారు. అందుకే నేను ఫైర్ అయ్యాను. బిగ్ బాస్ గురించి కాకుండా నా క్యారెక్టర్, నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడారు. బయటకు వచ్చాక నా వైఫ్ ఎంత కష్టపడిందో, బాధపడిందో చూసాను. అందుకే కేసు పెట్టాను. నా గురించే కాదు, చాలా మంది గురించి తప్పుగానే మాట్లాడారు. కేవలం వ్యూస్, డబ్బుల కోసం మీరు పక్కనోళ్ళ క్యారెక్టర్స్ గురించి ఎలా మాట్లాడతారు అంటూ ఫైర్ అయ్యాడు.

Also Read : Anchor Sravanthi : వరలక్ష్మి వ్రతం స్పెషల్.. చీరకట్టు మల్లెపూలతో యాంకర్ స్రవంతి..

Exit mobile version