Anchor Shiva
BiggBoss Nonstop : ఇటీవలే బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాల్టీ షో పూర్తయింది. ఈ షోలో విన్నర్ గా బిందు మాధవి గెలుపొందింది. ఇక హౌస్ నుంచి బయటకి వచ్చాక కంటెస్టెంట్స్ జనాల్ని పోగేసుకొని ఊరేగింపుగా వెళ్తూ రచ్చ చేయడం చూస్తూనే ఉంటాం. గత కొన్నేళ్లుగా బిగ్‌బాస్ జరిగిన ప్రతి సారి ఇదే జరుగుతుంది. హౌస్ లోని కంటెస్టెంట్ బయటకి వచ్చాక కొంతమంది జనాలతో జిందాబాద్ లు కొట్టించుకుంటూ డప్పులు, పూలు, అరుపులు ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకొని వెళ్తారు. దీనికి బాగానే ఖర్చుపెడతారు ఆ కంటెస్టెంట్స్. తమకి కూడా ఫాలోయింగ్ పెరిగింది, తాము సెలబ్రిటీలు అయ్యాము అని చెప్పుకోవడానికి ఇలాంటి ఏర్పాట్లు అన్ని చేస్తారు.
ఈ సారి కూడా బిగ్‌బాస్ అయ్యాక హౌస్ లోంచి యాంకర్ శివ బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్ లో చుట్టూ జనాలకి అభివాదం చేస్తూ వెళ్ళాడు. దీంతో చాలా మంది జనాలు శివ కార్ వద్దకు చేరి హంగామా చేశారు. ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటమే కాక అక్కడ వెళ్లే ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కలిగించారు. యాంకర్ శివ కార్ ని జనాలు చుట్టుముట్టి హడావిడి చేస్తూ, అరుస్తూ ముందుకి కదలనివ్వలేదు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇలా కార్ టాప్ మీదకు రావడం కరెక్ట్ కాదు, మీరు లోపల కూర్చుని ఇక్కడి నుంచి వెళ్ళాలి, మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని శివకి క్లాస్ పీకారు. తొందరగా అక్కడినుంచి వెళ్లిపోవాలని చెప్పారు.
NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
దీంతో యాంకర్ శివ కార్ లో కూర్చొని వెళ్ళిపోయాడు. మిగిలిన కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఇలాగే చేశారు. గతంలోనూ పలువురు కంటెస్టెంట్స్ ఇలాగే రచ్చ చేయడంతో అప్పుడు కూడా పోలీసులు వారిని మందలించారు. పర్మిషన్లు లేకుండా ఇలాంటి ర్యాలీలు చేపడితే ఊరుకోమని పోలీసులు తెలిపారు.
AnchorShiva craze ea verabba ?
Anchor Shiva on the way home ?@anchor_shiva #AnchorShiva #BiggBossNonStop #BiggBossNonStopTelugu pic.twitter.com/Z5GsaDBb9Q
— Shiva Fans Ikkada ⚡?❤️? (@iamkundum) May 21, 2022