Anchor Sravanthi Chokkarapu shared photos on hospital bed
Sravanthi Chokkarapu : ప్రముఖ టీవీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. కేవలం యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ కి కూడా వెళ్లి అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతా ఇంత కాదు. హీరోయిన్స్ ని మించే అందంతో ఎల్లప్పుడూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
Also Read : TG Vishwa Prasad : పవన్ కళ్యాణ్ గెలుపును అన్ని కోట్లు ఖర్చు చేసి ఎంజాయ్ చేసా.. టీజీ విశ్వ ప్రసాద్ వ్యాఖ్యలు
అయితే ఎప్పుడూ హాట్ ఫొటోస్ షేర్ చేసే ఈమె తాజాగా షాకింగ్ ఫోటోలని పెట్టింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అసలు తనకి ఏం జరిగిందో కూడా వివరించింది.” కేవలం ఆడవారి కోసం మాత్రమే ఈ పోస్ట్ పెడుతున్నా..అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. గత 35 – 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. డాక్టర్ ని కలిసే టైమ్ లేక స్కానింగ్ చేయించలేదని చెప్పింది.
అంతేకాకుండా..ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది,విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కలిసాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని ,వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ముందు లాగ నేను నడవాలి అంటే 4 నుండి 5 వారాలు పడుతుంది. నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే… అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేసాను మళ్ళీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని అడగకుండా ఉండకండి. అలా ఉన్నందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండని తెలిపింది యాంకర్ స్రవంతి.