Anchor Sravanthi – Suriya : సూర్యకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసిన యాంకర్ స్రవంతి..

తాజాగా నిన్న వైజాగ్ లో కంగువా సినిమా ఈవెంట్ నిర్వహించారు.

Anchor Sravanthi Proposed to Suriya on Stage in Kanguva Pre Release Event

Anchor Sravanthi – Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య ఇప్పుడు కంగువా సినిమాతో పాన్ ఇండియా వైడ్ రాబోతున్నాడు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా నిన్న వైజాగ్ లో కంగువా సినిమా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సూర్య, డైరెక్టర్ శివ వచ్చి సందడి చేసారు.

అయితే ఈ ఈవెంట్ ని యాంకర్ స్రవంతి, యాంకర్ రవి కలిసి హోస్ట్ చేసారు. ఈవెంట్ అయ్యాక సూర్య పలువురికి స్టేజిపైనే ఫొటోలు ఇచ్చాడు. ఈ క్రమంలో యాంకర్ స్రవంతి గులాబీ పువ్వు సూర్యకు ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చొని లవ్ యు చెప్పింది. దీంతో సూర్య కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఆ పువ్వు తీసుకొని థ్యాంక్యూ చెప్పాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

యాంకర్ స్రవంతి మోకాళ్ళ మీద కూర్చొని సూర్యకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడం ఒక ఎత్తైతే సూర్య కూడా మోకాళ్ళ మీద కూర్చొని థ్యాంక్యూ చెప్పడంతో ఫ్యాన్స్, నెటిజన్లు సూర్యని అభినందిస్తున్నారు.