Suma
Anchor Suma : బిగ్‌బాస్ నాన్ స్టాప్ అని చెప్పి ఈ సారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి అంతకు ముందు ఉన్న క్రేజ్ మాత్రం లేదు. షో చాలా చప్పగా సాగుతుందని అందరికి తెలుస్తుంది. బిగ్‌బాస్ అభిమానులు, అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు మాత్రమే వాళ్ళ కోసం షో చూస్తున్నారు. ఈ సారి షోలో ఇచ్చే టాస్కులు కూడా అంతగా ఆసక్తికరంగా లేవు. అపుడప్పుడు షోని హైప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు షో నిర్వాహకులు.
ఇటీవల షోకి హైప్ తీసుకురావడానికి హోలికి ఓంకార్ ని గెస్ట్ గా తీసుకొచ్చారు. తాజాగా ఇవాళ ఉగాది రోజున బిగ్‌బాస్ లోకి యాంకర్ సుమ రాబోతుంది. బిగ్‌బాస్ ప్రతి సీజన్‌లో సుమ వస్తూనే ఉంది. తన యాంకరింగ్ తో పాటు తన స్టైల్ తో అందర్నీ అలరిస్తుంది. సుమ వస్తే బిగ్‌బాస్ కి కొంచెం క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇవాళ ఉగాది ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా సుమ వస్తుంది.
Vijayendra Prasad : ‘ఆర్‌ఆర్‌ఆర్’కి సీక్వెల్ ఉంది.. కథ కూడా చెప్పాను
అయితే ఈ సారి యాంకర్ గా కాకుండా తన సినిమా జయమ్మ పంచాయితీ ప్రమోషన్స్ లో భాగంగా రానుంది. దీంతో అటు సుమకి, ఇటు బిగ్‌బాస్ కి ఈ ఎపిసోడ్ బాగానే కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక హౌస్ లో ఉన్న వాళ్ళందర్నీ సరదాగా ఆటపట్టించింది సుమ. ఈ ఎపిసోడ్ ఇవాళ రాత్రికి టెలికాస్ట్ అవ్వనుంది. ఇప్పటికే ప్రోమో విడుదల చేయగా దీనికి మంచి స్పందన వస్తుంది.