Vijayendra Prasad : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సీక్వెల్ ఉంది.. కథ కూడా చెప్పాను

ఈ సినిమాకి రాజమౌళి తండ్రి కథని అందించారు. రాజమౌళి అన్ని సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సీక్వెల్ కూడా ఉందని.........

Vijayendra Prasad : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సీక్వెల్ ఉంది.. కథ కూడా చెప్పాను

Rrr

 

RRR :  ఇటీవల చరణ్, తారక్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలేమి లేకపోవడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి కథని అందించారు. రాజమౌళి అన్ని సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సీక్వెల్ కూడా ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Paruchuri Venkateswararao : మా అన్నయ్య అలా ఎందుకు అయిపోయాడంటే

ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఆర్‌ఆర్‌ఆర్‌ షూట్ జరుగుతున్న టైంలోనే ఓ రోజు ఎన్టీఆర్‌, రాజమౌళి మా ఇంటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి అడిగారు. నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్‌, రాజమౌళికి బాగా నచ్చాయి. నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్ కి కూడా కథ అనుకున్నాను, అది వాళ్ళకి కూడా నచ్చింది. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో ఈ సినిమాకి సీక్వెల్‌ రావొచ్చు”అని తెలిపారు.