Paruchuri Venkateswararao : మా అన్నయ్య అలా ఎందుకు అయిపోయాడంటే

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ''అన్నయ్యకి ఏమి కాలేదు, అన్నయ్య బాగానే ఉన్నాడు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు ఆరోగ్యంలో కొంచెం తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే........

Paruchuri Venkateswararao : మా అన్నయ్య అలా ఎందుకు అయిపోయాడంటే

Paruchuri

Updated On : April 2, 2022 / 5:31 PM IST

 

Paruchuri GopalaKrishna : తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ రచయితల్లో పరుచూరి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ కథలని అందించారు. అంతే కాకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించారు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, తన తమ్ముడితో కలిసి ఎన్నో సినిమాలకి కథలు, మాటలు అందించారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఆయనకి 77 సంవత్సరాలు.

ఇటీవల ఆయనకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఆ ఫోటో చూసి పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోయారేంటి అని చాలా మంది బాధపడ్డారు. ఆయనకి ఏమైందని ఆరాతీశారు. అయితే ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. కానీ కొంతమంది అనారోగ్యం వల్ల ఇలా అయిపోయాడంటూ ప్రచారం చేశారు. తాజాగా ఈ విషయంపై ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఓ వీడియోని తన ఛానల్ లో రిలీజ్ చేశారు.

Ganesh Acharya : స్టార్ డ్యాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు

 

ఇందులో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ”అన్నయ్యకి ఏమి కాలేదు, అన్నయ్య బాగానే ఉన్నాడు. 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు ఆరోగ్యంలో కొంచెం తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు అంతే. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. నేను కూడా ఈ రెండు సంవత్సరాలలో 10 కిలోల వరకు బరువు తగ్గాను. అన్నయ్య అలా అయినా కానీ మేధస్సు మాత్రం అలాగే ఉంది.ఆ ఫొటో షేర్‌ చేసిన జయంత్‌ను నేను అడిగాను ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు అని. ఆ ఫోటో బయటకి వచ్చాక చాలా మంది చాలా రాశారు అన్నయ్య గురించి, అవన్నీ అవాస్తవం. కానీ కొంతమంది మాత్రం నిజం అర్ధం చేసుకొని 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కరెక్ట్‌గా చెప్పారు. వయసు మీదపడే కొద్ది శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి అంతే, అన్నయ్య ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు.