Ganesh Acharya : స్టార్ డ్యాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
బాలీవుడ్ ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య పై లైంగిక వేధింపుల కేసులో చార్జ్‌షీట్ దాఖలైంది. 2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసిన.............

Ganesh
Ganesh Acharya : బాలీవుడ్ ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య పై లైంగిక వేధింపుల కేసులో చార్జ్‌షీట్ దాఖలైంది. గణేష్ ఆచార్య బాలీవుడ్ లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్. వేరే భాషల్లో కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇటీవల తెలుగులో బాగా పాపులర్ అయిన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్ ని కూడా ఈయనే కంపోజ్ చేశారు. తాజాగా గణేష్ మాస్టర్ తో పాటు అతని అసిస్టెంట్ పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.
2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని, గణేష్ మాస్టర్ నన్ను చాలా రకాలుగా వేధించాడని, బలవంతం చేశాడని, తాను చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవాలని చూశాడని, అయితే తను నిరాకరించడంతో 6 నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం రద్దు చేయించారని తెలిపింది ఫిర్యాదులో.
Harnaaz Sandhu : మిస్ యూనివర్స్‌ని బాధపెడుతున్న వ్యాధి.. తినాలంటే కూడా ఆలోచించాల్సిందే
అంతేకాక మాస్టర్ తన అసిస్టెంట్స్‌తో తనపై దాడి చేయించాడని, పరువు తీశారని తెలిపింది. లాయర్ ని సంప్రదించి కేసు నమోదు చేయగా ఇప్పుడు చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణకి ఆదేశించారు. ఈ కేసుని మరోసారి విచారణ చేపట్టనున్నారు.