Anchor Suma : టాలీవుడ్ యాంకర్స్‌కి సుమ ఇంట ఓనమ్ విందు..
యాంకర్ సుమ కేరళ అమ్మాయి అని అందరికి తెలిసిన విషయమే. ఓనమ్ పండుగా సందర్భంగా టాలీవుడ్ లోని తన తోటి యాంకర్స్ అందరికి విందు..
- gum 95921
- Published On : August 29, 2023 / 06:49 PM IST
Anchor Suma Onam treat to all Tollywood Anchors Rashmi Gautam Anasuya Bharadwaj
Anchor Suma : యాంకర్ సుమ కేరళ అమ్మాయి అని అందరికి తెలిసిన విషయమే. కానీ తెలుగు సినిమాల్లో, టీవీ షోల్లో ఎక్కువ పేరు రావడంతో ఇక్కడ అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు ఏ టీవీ షో చూసినా, ఏ సినిమా ఫంక్షన్ చూసినా అక్కడ సుమ ఉండాల్సిందే. యాంకరింగ్ లో టాలీవుడ్ లోని యాంకర్స్ అందరికి మెగాస్టార్ గా నిలిచింది. కాగా కేరళ వారికి అతిపెద్ద పండగైన ఓనమ్‌ని (Onam) మలయాళీలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక కేరళ అమ్మాయి అయిన సుమ ఆ పండుగను జరుపుకోకుండా ఉంటుందా..?
Rajinikanth: బస్ డిపోలో తలైవా.. నిజమైన సూపర్ స్టార్ అంటూ..
ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ఆ పండుగను జరుపుకుంది. అయితే ఈసారి కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఓనమ్ సందర్భంగా టాలీవుడ్ లోని తన తోటి యాంకర్స్ అందర్నీ విందుకి ఆహ్వానించింది. దీంతో సాయి కుమార్, రవి, రష్మీ (Rashmi Gautam), అనసూయ (Anasuya Bharadwaj), విష్ణు ప్రియా, నేహా.. ఇలా యాంకర్స్ అంతా చీర, దోతీలతో ట్రెడిషనల్ గా రెడీ అయ్యి సుమ ఇంటికి విందుకు వచ్చారు. ఇక వచ్చిన అతిథులు అందరికి సుమ, రాజీవ్ కనకాల దంపతులు స్వయంగా వడ్డించి అద్భుతమైన విందు పెట్టి సంతోష పరిచారు.
Sankranti 2024 : ఈసారి పండక్కి సినిమాల జాతర మాములుగా లేదుగా..
ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పలువురు యాంకర్స్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజెన్స్ సుమకు ఓనమ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి సుమ ఇంట ఓనమ్ విందు ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఈ పోస్టులు చూసి తెలిసేసుకోండి.
