Jabardasth Punch Prasad : పంచ్ ప్రసాద్‌కి జగన్ ప్రభుత్వం సాయం.. ఏపీ సీఎంవో ట్వీట్!
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌కి జగన్ ప్రభుత్వం సాయం అందిస్తుంది. హాస్పిటల్ లో అనారోగ్యంతో పోరాడుతున్న ప్రసాద్ కి ఏపీ సీఎంవో నుంచి..
- gum 95921
- Updated on- June 9, 2023 / 05:08 PM IST
YS Jagan Mohan Reddy AP CMO help for Jabardasth Comedian Punch Prasad
Jabardasth Punch Prasad : జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తున్న పంచ్ ప్రసాద్ (Punch Prasad).. ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. గత కొంతకాలంగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. దానికి గాను రెగ్యులర్‌గా డయాసిస్ చికిత్స చేయించుకుంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల ప్రసాద్ కి చాలా సీరియస్ అవ్వడంతో.. డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే అది బాగా ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ప్రసాద్ కుటుంబం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Kajol : “లైఫ్‌లో కఠిన పరిస్థితులు ఎదుర్కుంటున్నా”.. కాజోల్ పోస్ట్ వైరల్.. అసలు ఏమైంది..?
ఇక ఇటీవల మరో జబర్దస్త్ కమెడియెన్ నూకరాజు (Jabardasth Emmanuel) తన సోషల్ మీడియా ద్వారా ప్రసాద్ కి హెల్ప్ చేయాలంటూ నెటిజెన్స్ ని కోరుతూ బ్యాంకు వివరాలు ఉన్న ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ ని ఒక నెటిజెన్ షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎంవో అధికారిని ట్యాగ్ చేశాడు. ఆ పోస్ట్ కి ఏపీ సీఎంవో రిప్లై ఇచ్చింది. ఇప్పటికే పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో సీఎంవో టీం టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. వారి చేత లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, అది అప్లై చేయగానే వెంటనే డాక్యుమెంట్లను పరిశీలించి సర్జరీకి అవసరమైన సహాయం అందిస్తామని చెప్పుకొచ్చారు.
NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..
ఈ రిప్లై చూసిన నెటిజెన్స్ ఏపీ ప్రభుత్వం స్పీడ్ గా ఆ ప్రక్రియ పూర్తి చేసి ప్రసాద్ కి ఆరోగ్యం బాగుపడేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా గతంలో జబర్దస్త్ జడ్జిగా చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయంలో ఆమె కొంచెం చొరవ తీసుకోవాలంటూ మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
