AP Cinema Policy: సినిమా టికెట్ రేట్లు. ఇటు తెలంగాణ..అటు ఏపీలో..ఇదో పెద్ద ఇష్యూ అవుతోంది. ప్రతిసారి పెద్ద సినిమాల రిలీజ్ అప్పుడు మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుతుండటం విమర్శలకు దారితీస్తోంది. సినిమా టికెట్ రేట్ ఎక్కువగా ఉండటంతోనే జనం పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ఐబొమ్మ రవి అరెస్ట్ అప్పుడు ఆయనకు ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో మద్దతు వచ్చింది.
కారణం మూవీ టికెట్ రేట్ల పెంపు ఒకటైతే..థియేటర్లలో ఫుడ్ ఐటమ్ రేట్లు అడ్డగోలుగా ఉండటంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ కీలక డెసిషన్ తీసుకున్నారు. టికెట్ల రేట్ల పెంపు అడ్డగోలుగా జరగకూడదని..దానికో పద్దతి..విధానం అంటూ ఫాలో కావాలని..సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్‌కు సూచించారు.
Also Read: ఒకదాని తర్వాత మరొక ఇష్యూతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇస్తారా?
అయితే తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు..టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ..సినీ ప్రముఖులు, పెద్దలతో భేటీ అవుతూ వస్తోంది. లేటెస్ట్‌గా మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై డిస్కస్ చేశారు. హైబడ్జెట్, ప్రత్యేక కేటగిరి సినిమాలకు టికెట్ల పెంపు కోసం ఎలాంటి సిస్టమ్‌ను ఫాలో అవ్వాలనేదానిపై చర్చించారు. అన్ని వర్గాలతో డిస్కస్ చేసి ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేయనుంది కమిటీ.
ఇప్పటి వరకు పాత జీవో ప్రకారం సినిమా టికెట్లు రేట్లు పెంచుతూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ రేట్లు పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. అయితే అడ్డగోలుగా..బడ్జెట్‌ను బట్టి..టికెట్ రేటును డిసైడ్ చేయడంపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం ఓ విధానాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్లు రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నారు.
టికెట్ల రేట్లను ఎలా నిర్ణయించాలనే దానిపై కమిటీ చర్చ
బడ్జెట్, హైబడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లను ఎలా నిర్ణయించాలనే దానిపై కమిటీ చర్చిస్తోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల ఒపీనియన్ కూడా తీసుకోనున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలతో నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతోందని..ప్రొడ్యూసర్లకు ప్రభుత్వం అండగా ఉండేలా కసరత్తు జరుగుతోందట. ప్రజలపై భారం పడకుండా, సినీ ఇండస్ట్రీకి నష్టం జరగకుండా బెస్ట్ పాలసీని తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే సినిమా టికెట్ రేట్లే కాదు..థియేటర్‌లో ఉన్న సమస్యలపై కూడా ఫోకస్ పెట్టారు.
అయితే పాప్ కార్న్ రేటే సినిమాను చంపుతుందని డైరెక్టర్ తేజ గతంలో డేరింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ధియేటర్లలో సినిమా టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పాప్ కార్న్ రేటును అందుబాటులోకి తీసుకొస్తేనే సినిమాకు, ఆడియన్స్‌కు అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఓటీటీ పైరసీతో సినిమా ఇండస్ట్రీ నష్టం పోతుందని వాదన కూడా వినిపించారు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి..అటు ప్రొడ్యూసర్లు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరితో ప్రభుత్వ పెద్దలు డిస్కస్ చేస్తున్నారు. ఫైనల్‌గా బెస్ట్ పాలసీని డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అదే కనుగ జరిగితే సినీ పాలసీ విషయంలో ఏపీ సర్కార్ రోల్ మోడల్ కానుంది. సినిమా టికెట్ల రేట్లు, సేమ్‌టైమ్ పాప్ కార్న్ కాస్ట్ రెండూ సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తే మాత్రం..ఆటోమేటిక్‌గా తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరగనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే డెసిషన్ మీదే ఉత్కంఠ కొనసాగుతోంది.