Dhurandhar 2: ‘దురంధర్ 2’ సినిమాకు నో చెప్పిన అనిల్ కపూర్.. అసలు కారణం చెప్పేసిన సీనియర్ నటుడు

దురంధర్ 2(Dhurandhar 2) సినిమాను మిస్ చేసుకోవడంపై క్లారిటీ ఇచ్చిన అనిల్ కపూర్.

Anil Kapoor clarifies why he turned down Dhurandhar 2

  • దురంధర్ 2ను మిస్ చేసుకున్న అనిల్ కపూర్
  • డేట్స్ క్లాష్ వల్ల కుదరలేదని చెప్పిన నటుడు
  • డిజప్పాయింట్ అవుతున్న ఆయన ఫ్యాన్స్

Dhurandhar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్‌ 2(Dhurandhar: The Revange)’. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్‌ కపూర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ‘డబుల్’ ధమాకా.. సోషియో ఫాంటసీతో సరికొత్త ప్రయోగం!

దురంధర్ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్రలో నటించే అవకాశం తన వద్దకు వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల దానిని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ పాత్ర కోసం అనిల్ కపూర్‌ను సంప్రదించినప్పుడు, ఆయన కూడా నటించడానికి ఎంతో ఉత్సాహం చూపారట. కానీ, అదే సమయానికి మరో దర్శకుడికి ఇచ్చిన డేట్స్ అడ్డు రావడంతో ‘ధురంధర్‌ 2’ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ విషయంపై అనిల్ కపూర్ మాట్లాడుతూ.. “ఒకరికి ఇచ్చిన మాటను తప్పి, డేట్స్‌ను క్యాన్సిల్ చేసి మరో సినిమాను అంగీకరించడం సరైన పద్ధతి కాదు. అద్భుతమైన అవకాశం కోల్పోవడం బాధాకరమే అయినా, వృత్తి పట్ల నిబద్ధత అంతకంటే ముఖ్యం కదా” అని అనిల్ కపూర్ చెప్పుకొచ్చాడు. కేవలం ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదని, క్రమశిక్షణ, ఇచ్చిన మాట మీద నిలబడటమే ఒక నటుడిని ఉన్నత స్థాయిలో ఉంచుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆదిత్య ధర్ దర్శకత్వంలో పనిచేసే అవకాశం ఖచ్చితంగా వస్తుందని అన్నారు. దీంతో, అనిల్ కపూర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.