Anil Kapoor turns 65: అనిల్ కపూర్ 65వ పుట్టినరోజు: శుభాకాంక్షలు తెలిపిన అన్న బోనీ కపూర్
అనిల్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన స్టార్లు.
- Bharath Reddy
- Published On : December 24, 2021 / 02:25 PM IST
Anil Kapoor
Anil Kapoor turns 65: బాలీవుడ్ “యంగ్ ఎవర్” నటుడు అనిల్ కపూర్ శుక్రవారం తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. అనిల్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన స్టార్లు, అనిల్ తో తమకున్న అనుబంధాన్ని గురించి కూడా ప్రస్తావించారు. ఇక తమ్ముడు అనిల్ కపూర్ పుట్టినరోజు సంధర్భంగా అన్న బోనీ కపూర్ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “65వ పుట్టినరోజు జరుపుకుంటున్న అనిల్ కపూర్ కు శుభాకాంక్షలు, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా యవ్వనంగా ఉండాలని బోనీ ఆశీర్వదించారు. ఈసంధర్భంగా, 1995 నాటి “జుడాయి” చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోను పంచుకున్న బోనీ, తనకు 40 ఏళ్ళు, తమ్ముడికి 39 ఏళ్ల వయసు… అయినా అప్పుడు ఇప్పుడు తమ్ముడు ఎంతో చక్కగా, ఫిట్ గా ఉన్నాడు” అంటూ బోనీ కపూర్ రాసుకొచ్చాడు
ఇక బాబాయ్ అనిల్ కపూర్ పుట్టినరోజు సంధర్భంగా బోనీ కపూర్ తనయుడు, అర్జున్ కపూర్ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “యవ్వనానికి మారుపేరు, నిత్య యవ్వనుడు మా బాబాయ్” అంటూ సరదాగా చిన్నపద్యాన్ని సైతం అర్జున్ కపూర్ రాసుకొచ్చాడు. అంతే కాదు అనిల్ కపూర్ యువ్వనంతో ఉన్న ఒక ఫోటోను.. ఇప్పటి తన ఫొటోలతో జత చేసిన అర్జున్, 2060లో తాను ముసలివాడినైనా సరే, బాబాయ్ అనిల్ కపూర్ మాత్రం అలాగే యవ్వనంగా ఉంటాడంటూ సరదాగా కామెంట్ చేసాడు. ఇక ఇంస్టాగ్రామ్లో వీరు పెట్టిన ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Rare Breed Horses : ఈ గుర్రం ధర రూ.5 కోట్లు..! అరుదైన జాతి గుర్రం ప్రత్యేకతలు
