Rare Breed Horses : ఈ గుర్రం ధర రూ.5 కోట్లు..! అరుదైన జాతి గుర్రం ప్రత్యేకతలు

ఈ అరుదైన జాతి గుర్రం ధర రూ.5 కోట్లు.. పలికింది. అయినా అమ్మేది లేదంటున్నాడు దాని యజమాని. మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా సారంగ్‌ఖేడ్‌ గుర్రాలమార్కెట్‌ లో ఈగుర్రం ఆకట్టుకుంటోంది.

Rare Breed Horses : ఈ గుర్రం ధర రూ.5 కోట్లు..! అరుదైన జాతి గుర్రం ప్రత్యేకతలు

Marwar Horses Price Rs.5 Cr

Rare Breed Horses : ఎత్తుగా బలిష్టంగా..చురుకుగా..వదిలిలే వాయువేగంతో దూసుకుపోయే గుర్రాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. వీటి ధర భారీ స్థాయిలో ఉంటుంది. గుర్రాల్ని శ్రీమంతులు చాలామంది స్టేటస్ సింబల్ గా పెంచుకుంటారు. మరికొంతమంది రేసుల కోసం పెంచుతారు. ఎలా పెంచిన గుర్రాలను మెయిన్ టెన్ చేయటం అంటే మాటలు కాదు..లక్షల్లో ఖర్చు అవుతుంది. మేలు జాతి గుర్రాల్ని పెంచే శ్రీమంతులు వాటిని సొంతంచేసుకోవటానికి కోట్ల రూపాయాలు పెడతారు. అలా ఓ అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.5 కోట్లకు కొనటానికి ముందుకు వచ్చారు. అయినా ఆ గుర్రాన్ని అమ్మేది లేదంటున్నాడు దాన్ని యజమాని. మరి ఆ గుర్రం ఏంటీ? ఏజాతికి చెందింది? అంత ధర ఇస్తానన్నా అమ్మటానికి ఎందుకు యజమాని అంగీకరించట్లేదు? ఆ గుర్రం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

Read more : Lamb Price : ఈ గొర్రె ధర అక్షరాలా రూ.2 లక్షలు

మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా సారంగ్‌ఖేడ్‌ అశ్వాల మార్కెట్‌ (Sarang Khed Market) ఎంతో ప్రసిద్ధి చెందింది. పలు మేలు జాతి గుర్రాలకు ఈ మార్కెట్ పెట్టింది పేరు. పలు జాతుల గుర్రాలు ఈ మార్కెట్ లో అమ్మకానికి వస్తాయి. అలా నాసిక్ నుంచి వచ్చిన రావణ్ అనే పేరున్న గుర్రానికి రూ. 5 కోట్లు ఇచ్చి కొనేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా అమ్మేందుకు దాని యజమాని అసద్ సయ్యద్ నిరాకరించారు.

ఎందుకంటే ఈ గుర్రానికి ఉన్న డిమాండ్ అటువంటిది. ఇంకా ధర ఇచ్చి కొనేవారు ఉంటారని నమ్మకం. ఈ గుర్రం marwar జాతికి చెందిన అరుదైన గుర్రం. 68 అంగుళాల ఎత్తుతో బలిష్టంగా చూపుతిప్పుకోలేని దర్పం ఈ గుర్రం సొంతం. ఈ గుర్రం రోజుకు 10 లీటర్ల పాలు, కిలో నెయ్యి, 5 గుడ్లు, చిరుధాన్యాలు, తవుడు, డ్రై ఫ్రూట్స్ తింటుంది.సారంగ్‌ఖేడ్‌ అశ్వాల మార్కెట్‌ ఈ ఏడాది ఎన్నో జాతి గుర్రాల్ని అమ్మకానికి తీసుకురాగా..కేవలం నాలుగు రోజుల్లోనే 278 గుర్రాలు అమ్ముడుపోయాయి.అంటే గుర్రాలను కొనటానికి శ్రీమంతులు ఎంతగా ఆసక్తి చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు.

Read more : గొర్రె ఖరీదు రూ.3 కోట్లు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు

కాగా మార్వారి జాతి గుర్రాలకు ఎంతో చరిత్ర ఉంది. మధ్య యుగాలలో ఈ మార్వారి జాతి గుర్రాల పెంపకం గురించి..వాటి సంరక్షణ గురించి ప్రస్తావించబడింది.భారత్ దేశంలోని రాస్థాన్ లోని రాజ్ పుత్ లు ఈ మార్వారి జాతి గుర్రాల్ని పెంచుకునేవారు. ఈ గుర్రాల్ని ఎక్కవగా రాథోర్ వంశీకులు సంరక్షించేవారు. ప్రపంచంలో ఏ జాతి గుర్రాలకు లేని ఓ ప్రత్యేకత ఈ మార్వారి జాతి గుర్రాలకు ఉంటుంది.

Read more : Rs 1 Crore Bull : ఒక్క ఎద్దు ధర రూ. కోటి.. అందుకే అంత డిమాండ్

ఈ జాతి గుర్రాల చెవులు ప్రత్యేకంగా ఉంటాయట. ఎంత దూరం నుంచైనా శబ్దాన్ని గుర్తించగలవట ఈ జాతి గుర్రాలు. పొడవైన మెడ..పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. అందుకే పరుగులో దూసుకుపోతుంటాయి ఎంత దూరమైనా ఏమాత్రం అలసట లేకుండా పరుగు పెట్టటంలో మార్వారి జాతి గుర్రాలు ప్రత్యేకమైనవిరి గుర్రాల సంరక్షణ నిపుణులు చెబుతారు.

Read more : Rs.1 Lakh Paan : ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు..!!