గొర్రె ఖరీదు రూ.3 కోట్లు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు

  • Published By: nagamani ,Published On : August 29, 2020 / 10:55 AM IST
గొర్రె ఖరీదు రూ.3 కోట్లు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు

ఆ గొర్రె ఖరీదు రూ.3 కోట్లు. అంటే హా..అని నోరెళ్లబెట్టేస్తాం కదూ. ఓ గొర్రె ఖరీదు అంత ధర అంటే ఏదో విశేషం ఉండే ఉంటుందనుకోవాలి. నిజమే మరి. ఆగొర్రె డైమండ్..అంతేకాదండోయ్..డబుల్ డైమండ్. డైమండ్ ఏంటీ..కొంపతీసి దాని పొట్టలో డైమండ్స్ గానీ ఉన్నాయా? ఏంటీ అనుకోవచ్చుకూడా. అదేంకాదు.. ఆ గొర్రె పేరు డబుల్ డైమండ్…!!



గురువారం (ఆగస్టు 25,2020) స్కాట్‌లాండ్‌ లోని లనార్క్‌లో స్కాటిష్ నేషనల్ జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో ఈ 6 నెలల వయస్సున్న గొర్రె (టెక్సెల్ లాంబ్ ) ఏకంగా £3,65,000 (అంటే ఇండియన్ కరెన్సీలో 3.5 కోట్లు) ధర పలికింది. ఆ గొర్రె పేరు డబుల్ డైమండ్ అని ముందే చెప్పుకున్నాం కదా..అదీ ఆ గొర్రె డిమాండ్. రూ.3.5 కోట్ల ధర పలికి డబుల్ డైమండ్ గొర్రె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెగా రికార్డు సృష్టించింది. ఇటువంటి ఖరీదైన గొర్రెలను పెంచే ప్రసిద్ధ పెంపకందారుడు చార్లీ బోడెన్ డబుల్ డైమండ్ ను వేలంపాటలో రూ.3.5 కోట్లకు విక్రయించారు. టెక్సెల్ అమ్మకందారులు ఈ గొర్రెను కొనుగోలు చేశారు.

గతంలో ఓ టెక్సెల్ లాండ్ 2,31,000 కు అమ్ముడు కాగా ఈ డబుల్ ల్యాంబ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ డబుల్ డైమండ్‌ టెక్సెల్ లాండ్ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ పౌండ్‌లతో హెక్సెల్‌ డ్జాంగో అనే గొర్రె రికార్డు సాధించింది. ఈ వేలంలో మొత్తం 19 లాంబ్ లు అమ్ముడు కాగా..వీటిలో డబుల్ డైమండ్ మాత్రమే రికార్డు స్థాయిలో అమ్ముడైంది.



కాగా..స్టాక్‌పోర్టు, చెషైర్‌‌కు చెందిన ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి. నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందిన ఈ గొర్రెలు టెక్సెల్‌ జాతికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా పెంచుతుంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్‌ పౌండ్ల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్‌ కోసం వినియోయోగిస్తుంటారు. అటువంటి గొర్రెలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో వీటిని లక్షలు..కోట్లు పెట్టి కొంటుంటారు.

అలాగే ఈ టెక్సెల్ గొర్రె బొచ్చు( నూలు)తో తయారు చేసిన స్వెట్టర్లు..మంకీ క్యాప్స్ వంటివాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.దీంతో ఈ గొర్రెలకు చాలా డిమాండ్ ఉంటుంది. లక్షలు పెట్టి ఈ గొర్రెల్ని కొంటుంటారు వ్యాపారులు.