Lamb Price : ఈ గొర్రె ధర అక్షరాలా రూ.2 లక్షలు

ఈ గొర్రెపోతు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా లక్షల రూపాయలకు అమ్ముడై గొర్రె కూడా ఇంత ధర ఉంటుందా?అనిపించింది.

Lamb Price : ఈ గొర్రె ధర అక్షరాలా రూ.2 లక్షలు

Sheep Sold Worth Rs 1.91 Lakh In Karnataka

sheep sold worth Rs. laks తెల్లగా మెరిసిపోయే ఈ గొర్రెపోతు ధర తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం. సాధారణంగా ఓ గొర్రెపోతును కొనాలంటే ధర రై.10 నుంచి 20వేలు ఉంటుంది. అదే బాగా బలిసినదైతే మరో రూ.5 లేదా 10వేలు ఎక్కువ ఉండొచ్చు. చక్కగా మెడలో పూలదండతో అందంగా ముస్తాబైన ఈ గొర్రెపోతు ధర మాత్రం షాకింగ్ గా ఉంది. దీని ధర అక్షరాలా రూ.1.91 లక్షలు అంటూ దాదాపు రూ.2లక్షలు. ఇంత ధర ఉందీ అంటే ఆ గొర్రెపోతు ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అని అనుకుంటాం. నిజమే మరి దాని స్పెషలే వేరు..ఈ గొర్రె బందూర్ జాతికి చెందినది. సంతానోత్పత్తి కోసం ఈ జాతికి చెందిన గొర్రెల్ని భారీ ధరకు కొంటుంటారు.

Read more : గొర్రె ఖరీదు రూ.3 కోట్లు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు

కర్ణాటకలోని మాండ్య జిల్లా మళవళ్లి తాలుకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప దీన్ని రూ.1.91 లక్షలకు అమ్మాడు. సణ్ణప్ప ఈ గొర్రెను చిన్నగా ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం కొన్నాడు. అంత చిన్నపిల్లే అయినా దీన్ని 1 లక్షా 5 వేలకు కొన్నాడు. మరి ఇంతకాలం పెంచాడు మరి ఆమాత్రం ధర ఉండదా ఏంటీ అన్నట్లుగా దాన్ని రూ.1.91 లక్షలకు అమ్మాడు. సాధారణంగా సణ్ణప్ప గొర్రెల్ని మేకల్ని కొని కొంతకాలం వాటిని పెంచి తిరిగి అమ్ముతుంటాడు.అలా సణ్ణప్ప దగ్గర 25పైగా మేలు రకం గొర్రెలున్నాయి.ఈ గొర్రెపోతుని చాలా జాగ్రత్తగా పెంచాడు. చక్కటి పౌష్టికాహారం పెట్టాడు. బాగా బలిసేలా సమయానికి అన్ని రకాల ఆహారాలుఅందించాడు. పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు దాన్ని అమ్మకానికి పెట్టగా.. మద్దూరు తాలుకాలోని బిదరకోటే‌కు చెందిన వ్యక్తికి అమ్మేశాడు.

Read more :  Bbaahubali Bull :ఈ బాహుబలి దున్న‌పోతు వెరీ రిచ్..ప్రీమియం స్కాచ్, సండే స్విమ్మింగ్,కిలోల కొద్దీ డ్రైఫ్రూట్..

దాన్ని కొన్న వ్యక్తి దాన్ని పూలదండలతో అలంకరించి..డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ గొర్రెను చూడటానికి జనం భారీగా తరలివచ్చారు. ఇంతకూ ఈ గొర్రెకు ఇంత ధర ఎందుకు అంటే లాభం లేకుండా ఎందుకు కొంటారు? ఈ గొర్రె సంతానోత్పత్తికి చక్కటి అనువైనదట. అలా దాన్ని కొన్న సణ్ణప్ప బానే సంపాదించాడు. ఈ విషయం తెలిసే భారీ ధర పెట్టి మరీ కొనుగోలు చేశాడు సదరు వ్యక్తి.