Bbaahubali Bull :ఈ బాహుబలి దున్న‌పోతు వెరీ రిచ్..ప్రీమియం స్కాచ్, సండే స్విమ్మింగ్,కిలోల కొద్దీ డ్రైఫ్రూట్..

బాహుబలి దున్నపోతు లైఫ్ స్టైల్ వెరీ రిచ్. వారానికి ఒక‌సారి ప్రీమియం స్కాచ్ అవలీలగా తాగేస్తుంది. దీనికి ప్ర‌తి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, డజన్ల కొద్దీ యాపిల్స్‌ లాగించేస్తుంది.

Bbaahubali Bull :ఈ బాహుబలి దున్న‌పోతు వెరీ రిచ్..ప్రీమియం స్కాచ్, సండే స్విమ్మింగ్,కిలోల కొద్దీ డ్రైఫ్రూట్..

Bahubali Bull

Hyderabad Sadar Festival : ఏరా పనీ పాటా లేదా..దున్నపోతులాగా తిని తిరుగుతున్నావ్ అని తిడతారు. కానీ దున్నపోతులు అంటే అంత తేలిగ్గా తీసిపారేయటానికి లేదు. హైదరాబాద్ లో ప్రతీ సంవత్సరం జరిగే సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల ఖర్చు..వాటి లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే దున్నపోతు లైఫే సో బెటర్ అనిపిస్తుంది. దున్నపోతులపై వాటి యజమానులు ఎంత ఖర్చు పెడతారో..వాటి వీర్యాన్ని అమ్మి అంతకు మించి సంపాదిస్తారు. ఈ దున్నపోతుల్ని యజమానులు స్కాచ్, ట్రైఫ్రూట్స్ పెట్టి మరీ పెంచి పోషిస్తారు.అంతేకాదు వీటికి ప్రతీ రోజు నూనెతో మసాజ్ చేస్తారు. వ్యాయామం కోసం స్విమ్మింగ్ కు తీసుకెళతారు.వీటికి స్పెషల్ గా ఏసీ రూములు. మరి ఇంత రిచ్ లైఫ్ అనుభవించే ఈ దున్నపోతుల రిచ్ లైఫ్ మామూలుగా ఉండదు.అటువంటి ఓ బాహుబలి దున్నపోతు గురించి తెలుసుకుంటే వావ్ ..దున్నపోతా మజాకా అనిపిస్తుంది.

Read more : గొర్రె ఖరీదు రూ.3 కోట్లు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు

బాహుబలి దున్నపోతు వెరీ రిచ్..
హ‌ర్యానాకు చెందిన బాహుబలి దున్నపోతు. వారానికి ఒక‌సారి ప్రీమియం స్కాచ్ అవలీలగా తాగేస్తుంది. దీనికి ప్ర‌తి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, డజన్ల కొద్దీ యాపిల్స్‌ లాగించేస్తుంది. అంతేనా వీటితో పాటు ప్ర‌తి రోజు 25 లీట‌ర్ల చిక్కటి పాలు చక్కగా కూల్ గా తాగేస్తుంది. ప్ర‌తి శ‌నివారం నూనెతో బాడీ మ‌సాజ్ తప్పనిసరి. అలాటిలాంటి నూనె కాదు బాదం నూనెతో దీనికి మసాజ్ చేస్తారు. దున్నపోతుకు స్కాచ్ తాగించటం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు దాని యజమాని. అంతేకాదు స్కాచ్ తాగటం వల్ల దీనికి చక్కటి జీర్ణవ్యవస్థ ఉంటుందంటున్నారు.

ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న ఈ దున్న‌పోతు హైద‌రాబాద్ స‌ద‌ర్ ఉత్స‌వాల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌ుస్తోంది. వయస్సు ఆరేళ్లు. 2000 కేజీల బ‌రువున్న ఈ బాహుబ‌లి దున్న 7.5 అడుగుల పొడ‌వు, 18 అడుగుల వెడ‌ల్పు ఉంది. ఈ బాహుబ‌లి దున్న‌ హ‌ర్యానా నుంచి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో జరుగుతున్న స‌ద‌ర్ ఉత్స‌వాల్లో ప్రదర్శనకు పెట్టగా..దీని మీదే ఉంది అందరి చూపు.

Read more :  ఒక ఆవు ధర రూ.2.61 కోట్లు..ప్రపంచ రికార్డు సృష్టించిన గోమాత

ఈ దున్న‌పోతును ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు యజమాని. ప్ర‌తి రోజు 3 కిలోమీట‌ర్ల మేర వాకింగ్‌, ప్ర‌తి ఆదివారం స్విమ్మింగ్‌ తప్పనిసరి. స్విమ్ చేసిన త‌ర్వాత త‌నంత‌ట తానే ఇంటికి తిరిగి వ‌స్తుందట ఈ బాహుబలి దున్న. ఈ దున్నపోతుకు రోజుకు రూ. 7 వేల‌ు ఖర్చు ఉంటుందట. దీన్ని నిరంరతం సంరక్షించటానికి దాన్ని చూసుకోవటానికి ముగ్గురు డ్యూటీలో ఉంటారట. చూశారా మరి..దున్నపోతా మజాకానా? ఏమి దీని లైఫ్ స్టైల్..వెరి రిచ్ కదూ..

Read more :  International Dog Day : ఈ కుక్కలు వెరీ కాస్ట్లీ గురూ..