ఒక ఆవు ధర రూ.2.61 కోట్లు..ప్రపంచ రికార్డు సృష్టించిన గోమాత

ఒక ఆవు ధర రూ.2.61 కోట్లు..ప్రపంచ రికార్డు సృష్టించిన గోమాత

Cow cost World record  : ఒక ఆవు ధర ఎంతుంటుంది? మహా ఉంటే రూ.లక్ష ఉంటుందేమో. కానీ ఓ ఆవు ధర వింటే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా రూ.2.61 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది..! ఇంత భారీ ధరకు అమ్ముడైన ఆ ఆవు పేరు ఆవు పేరు పోష్ స్పైస్ (Posh Spice). ప్రపంచంలో అత్యుత్తమ జాతి ఆవుల్లో ఈ ఆవు చాలా మేలుజాతి గలది. ఈ పోష్ స్పైస్ ఆవును వేలం వేయగా రూ.2.16 కోట్లకు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది.


మధ్య ఇంగ్లండ్‌లోని ఆ ఆవు వయసు 14 నెలలు. పేరు పోష్ స్పైస్. ఈ ఆవును వేలం వేయగా.. 2,62,000 పౌండ్లకు అమ్ముడైపోయింది. అంటే మన భారత కరెన్సీలో రూ.2.61 కోట్లు. ప్రపంచంలో అత్యుత్తమ జాతి ఆవుల్లో ఇదీ ఒకటి కావటంతో వేలంలో ఏకంగా రూ.2.61 కోట్లకు అమ్ముడైంది.

దీన్ని వేలం వేయగా ప్రపంచ రికార్డు స్థాయిలో అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదివరకు ఇలాగే వేలం వేసిన ఆవు ధర కంటే పోష్ స్పైస్ ధర దాదాపు రెట్టింపు పలికింది వేలంపాటలో. ష్రాప్‌షైర్‌కి చెందిన లిమోసిన్ హైఫెర్ అనే వ్యక్తి ఈ ఆవును వేలంలో దక్కించుకున్నారు.

2014లో ఓ ఆవు రూ.1.31 కోట్లు పలికింది. ఇప్పటివరకూ ప్రపంచంలో ఖరీదైన ఆవు అదే. ఇప్పుడు ఆ రికార్డును ‘పోష్ స్పైస్’ తన్నిపారేసింది. అంతేకాదండోయ్.. యూరప్, బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన ఆవుగా కూడా పోష్ స్పైస్ నిలబడింది. పొడిగ్రీ జాతికి చెందిన పోష్ స్పైస్‌కి… ఈ పేరు పెట్టడానికి ఓ కారణం కూడా ఉంది. 1990 నాటి వరల్డ్ ఫేమస్ పాప్ బ్యాండ్ స్పైస్ గర్ల్స్… ని పోష్ స్పైస్ అని కూడా అంటారు. ఆ బ్యాండ్ అంటే ఈ ఆవు ఓనర్లకు ఇష్టం. అందుకే దీనికి పోష్ స్పైస్ అనే పేరు పెట్టారు.

కాగా ఈ ఆవులు కాస్త రఫ్‌గా ఉంటాయట. ఇటువంటి జాతిని 1989 నుంచి డాన్, ఆయన కూతురు, రైతు అయిన క్రిస్టీన్ విలియమ్స్ పెంచుతున్నారు. ఓ ఆవుకి పుట్టిన నాలుగు దూడలను వీరు కాపాడి పెంచి పెద్దచేశారు. ఆ దూడల తల్లి చనిపోయింది. దీంతో వారు ఆ దూడల్ని అతి జాగ్రత్తగా పెంచి పోషించారు. ఈ ఆవు ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవ్వడంపై క్రిస్టీన్ ఆశ్చర్యపోతున్నారు. ఇంత ధర పలుకుతుందని మేం అస్సలు అనుకోదనీ ఆశ్చర్యపోయారు.

ఈ ఆవు మేలు జాతికి తగినట్లుగా చూడటానికి చాలా అందంగా ఉంటుందనీ అందుకే ఇంత ఎక్కువ ధర పలికిందని అంటున్నారు. ఈ ఆవులు ప్రపంచంలోనే ఉత్తమ జాతి ఆవుల్లో ఇవి కూడా ఒకటి. అందువల్ల ఇలాంటి ఆవులను పెంచే కాంబ్రియాలోని జెన్కిన్సన్, గ్రేటర్ మాంచెస్టర్ లోని డేవిస్, బిడెన్… తమకు పోష్ స్పైస్ కావాలని అడిగారు. దీంతో వేలానికి పెట్టగా ప్రపంచ రికార్డు సృష్టించిన ధర పలికింది.