Koffee With Karan : కరణ్‌కి తోడు అనిల్ కపూర్.. ఇది ‘కాఫీ విత్ కరణ్’ షోనా లేదా డర్టీ షోనా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఈ సారి కరణ్ కి తోడుగా అనిల్ కపూర్ కూడా అలాగే సమాధానాలు ఇవ్వడంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో కరణ్ జోహార్ అనిల్ కపూర్ ని మిమ్మల్ని ఎప్పుడూ యంగ్ గా ఉంచే మూడు విషయాలు ఏంటి అని అడగగా............

Anil Kapoor wild answers to Karan Johar in Koffee With Karan show

Koffee With Karan :  బాలీవుడ్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పదకొండో ఎపిసోడ్ రానుంది. తాజాగా 11వ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో అనిల్ కపూర్, వరుణ్ ధావన్ గెస్టులుగా వచ్చారు. ఇక కరణ్ షోలో పర్సనల్ క్వశన్స్, సెక్స్ లైఫ్ మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరణ్ ఈ షోలో అడిగిన ప్రశ్నలకు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కరణ్ అడిగే పిచ్చి ప్రశ్నలకు వచ్చే గెస్టులు కొంతమంది సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతారు. మరి కొంతమంది కరణ్ కి కౌంటర్లు ఇస్తారు. అయితే ఈ సారి కరణ్ కి తోడుగా అనిల్ కపూర్ కూడా అలాగే సమాధానాలు ఇవ్వడంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో కరణ్ జోహార్ అనిల్ కపూర్ ని మిమ్మల్ని ఎప్పుడూ యంగ్ గా ఉంచే మూడు విషయాలు ఏంటి అని అడగగా అనిల్ కపూర్ .. సెక్స్, సెక్స్, సెక్స్ అని చెప్పాడు. దీంతో ఈ సారి కరణ్ ఆశ్చర్యపోయాడు.

Saakini Daakini Trailer : కామెడీతో మొదలుపెట్టి యాక్షన్ తో అదరగొట్టిన రెజీనా, నివేదా.. శాకిని డాకిని ట్రైలర్ రిలీజ్..

ఇక వరుణ్ ధావన్ ని కరణ్ ఏ ప్రశ్న అడిగినా అన్నిటికి అర్జున్ కపూర్ అనే సమాధానం చెప్పాడు. దీంతో అనిల్ తాను నాకు రిలేటివ్ అని చెప్పాడు. ఇక వరుణ్, అనిల్ కపూర్ కలిసి పిచ్చిగా డ్యాన్సులు వేశారు. కరణ్ కి తోడు ఈ సారి అనిల్ కపూర్ కూడా ఇలా మాట్లాడటంతో ఈ ప్రోమో వైరల్ గా మారగా నెటిజన్లు ఇది కాఫీ విత్ కరణ్ షోనా లేక డర్టీ షోనా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఉందంటే ఇక ఎపిసోడ్ లో కరణ్ ప్రశ్నలు, అనిల్ కపూర్ సమాధానాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నారు.