Anil Ravipudi : అనిల్ రావిపూడి వాళ్ళ నాన్న ఏం చేస్తారో తెలుసా? అలాంటి మాములు లైఫ్ నుంచి వచ్చి కొడుకు స్టార్ డైరెక్టర్ గా..

అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో(Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అని రాబోతున్నాడు. ఇన్నాళ్లు తన కామెడీ టైమింగ్ తో సినిమాలు హిట్ చేసిన అనిల్ ఈ సారి బాలయ్య కోసం మాస్ బాట పట్టాడు.

Anil Ravipudi Father Interesting Facts Revealed by Vamsi Paidipally

Anil Ravipudi :  డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా దూసుకుపోతున్నాడు. రచయితగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి పలు సినిమాలకు రచయితగా, దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ తర్వాత పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుసగా సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3.. ఇలా వరుసగా ఆరు సినిమాలు హిట్స్ కొట్టాడు.

అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో(Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అని రాబోతున్నాడు. ఇన్నాళ్లు తన కామెడీ టైమింగ్ తో సినిమాలు హిట్ చేసిన అనిల్ ఈ సారి బాలయ్య కోసం మాస్ బాట పట్టాడు. తాజాగా నిన్న ఆదివారం రాత్రి భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యారు.

వంశీ పైడిపల్లి ఈవెంట్లో మాట్లాడుతూ అనిల్ రావిపూడి గురించి చెప్తూ.. ఎప్పట్నుంచో అనిల్ తెలుసని, చాలా సరదా మనిషని, ఎవరు ఎంత బాధలో ఉన్నా నవ్విస్తాడని, ఇండస్ట్రీలో నాకున్న తమ్ముడు అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అలాగే అనిల్ తో పాటు వాళ్ళ నాన్నని కూడా స్టేజిపైకి పిలిచి అందరికి పరిచయం చేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అనిల్ వాళ్ళ నాన్న ఒక మాములు బస్సు డ్రైవర్. ఒక మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అనిల్ కష్టపడి ఇవాళ ఎవరూ సాధించలేని విధంగా ఆరు హిట్స్ వరుసగా కొట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని అన్నారు. అలాగే.. ఇంత డబ్బు సంపాదించినా చాలా సింపుల్ గా ఉంటారు. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటే అనిల్ వాళ్ళ నాన్న రోజు అనిల్ కి ఇంటి నుంచి భోజనం మెట్రోకి LB నగర్ వరకు వచ్చి అక్కడ్నుంచి రామోజీ ఫిలిం సిటీకి తీసుకువచ్చేవాళ్ళు. ఇవాళ అనిల్ సక్సెస్ అయ్యాడు, ఇంకా సక్సెస్ అవుతాడు అని అభినందించారు.

Also Read : Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్.. బిడ్డ ముందు తండ్రి నిలబడితే..

దీంతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, ఒక సాధారణ డ్రైవర్ కొడుకుగా ఉంది ఇవాళ స్టార్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఎదగడం మాములు విషయం కాదని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు