Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్.. బిడ్డ ముందు తండ్రి నిలబడితే..
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ చేశారు.

Balakrishna Sreeleela Kajal Anil Ravipudi Bhagavanth Kesari Movie Trailer Released
Bhagavanth Kesari Trailer : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటిస్తోండగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో బాలయ్య శ్రీలీల మధ్య అనుబంధం, శ్రీలీలని ఆర్మీకి పంపాలని బాలయ్య తాపత్రయం, శ్రీలీల ఆర్మీ కోసం కష్టపడలేకపోవడం, విలన్, బాలయ్య – విలన్ మధ్య డైలాగ్స్, ఖైదీగా జైలులో బాలకృష్ణ.. ఇలా ఆసక్తికరంగా తండ్రి కూతుళ్ళ బంధంతో బాలయ్య మార్క్ మాస్ తో సినిమా ఉండబోతుందని చూపించారు.
Also Read : Maama Mascheendra : ఓటీటీలోకి సుధీర్ బాబు సినిమా..! థియేటర్‌లో ఉండగానే..?
ఇప్పటికే భగవంత్ కేసరి టీజర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. బాలయ్యని సరికొత్తగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.