×
Ad

Bhagavanth Kesari 2: భగవంత్ కేసరి సీక్వెల్.. ఆ పాత్ర చుట్టూ పవర్ ఫుల్ కథ.. అనిల్ కామెంట్స్ వైరల్

బాలకృష్ణ భగవంత్ కేసరి ప్రీక్వెల్(Bhagavanth Kesari 2) గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి.

Anil Ravipudi interesting comments about balakrishna Bhagavanth Kesari sequel.

  • బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి సినిమాకి ప్రీక్వెల్
  • పోలీస్ పాత్రతో సరికొత్త కథ
  • అనిల్ కామెంట్స్ వైరల్

Bhagavanth Kesari 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ 2023లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నెలకొంది భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ నటన సినిమాకె హైలెట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ యాసలో బాలకృష్ణ డైలాగ్స్ చెప్తుంటే థియేటర్స్ ఊగిపోయినవ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బనావో బేటికో షేర్ అనే కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.

అయితే, ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ చేసే ఆలోచన చేసినట్టుగా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ భగవంత్ కేసరి సినిమా సీక్వెల్(Bhagavanth Kesari 2) గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు.

Sreemukhi: అందాల దేవకి శ్రీముఖి.. ఎరుపు చీరలో వలపు వల.. ఫొటోలు

దానికి సమాధానంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. భగవంత్ కేసరి సినిమా నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. బాలకృష్ణ పాత్ర అద్భుతంగా ఉంటుంది. మా టీం కూడా ఈ సినిమాకు సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. బాలకృష్ణ పోలీస్ పాత్ర పరిచయానికి ముందు ఏం జరిగి ఉంటుంది అని. చాలా మంది కథ కూడా అది. కానీ, ఎందుకో ఆ ప్రీక్వెల్ పై ఆలోచన చేయలేదు. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే ఆ ప్రీక్వెల్ చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

ఇక అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ కి నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఓపక్క మాస్ ఎలిమెంట్స్, మరోపక్క సోషల్ ఎలిమెంట్స్ చాలా పక్కాగా కుదిరిన సినిమా ఇది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నిజంగా తెరపైకి వస్తుందా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు.