Anil Ravipudi: కింగ్ నాగార్జునతో హలో బ్రదర్.. ఆ రికార్డ్ నాదే.. కొత్త సినిమా విషయాలు చెప్పిన అనిల్

కింగ్ నాగార్జునతో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).

Anil Ravipudi: కింగ్ నాగార్జునతో హలో బ్రదర్.. ఆ రికార్డ్ నాదే.. కొత్త సినిమా విషయాలు చెప్పిన అనిల్

Anil Ravipudi interesting comments about making a movie with Nagarjuna.

Updated On : January 11, 2026 / 7:52 PM IST
  • నెక్స్ట్ సినిమాపై అనిల్ ఆసక్తికర కామెంట్స్
  • నాగార్జునతో సినిమా చేస్తే సరికొత్త రికార్డ్
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. చాలాకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సినిమా చేయడం. వింటేజ్ లుక్స్ లో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. అయితే, కెరీర్ ముందు నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) సీనియర్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆయన వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఇక బాలకృష్ణతో భగవంత్ కేసరి లాంటి సోషల్ సినిమా చేసాడు జాతీయ అవార్డు అందుకున్నాడు.

Rashi Singh: పింక్ స్కర్ట్ లో రాశి సింగ్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్.. ఫొటోలు

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. అయితే, సీనియర్ హీరోలలో ఆయన కేవలం నాగార్జునతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా ఇదే విషయం గురించి అనిల్ దగ్గర ప్రస్తావించగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ దర్శకుడు. ‘టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో సినిమాలు చేశాను.

మరి నాగార్జునతో సినిమా ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. ఆయనతో ఒక సినిమా చేయాలని నాకూ కూడా ఉంది. చేస్తే ఈతరంలో నలుగురు అగ్ర హీరోలతో సినిమాలు ఫస్ట్ డైరెక్టర్ గా రికార్డ్‌ నాదే అవుతుంది. అయితే, మన శంకరవరప్రసాద్ గారు సినిమా తరువాత ఏ సినిమా చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. త్వరలోనే కొత్త సినిమాను ప్రకటిస్తాను”అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇక గతంలో కూడా నాగార్జునతో హలోబ్రదర్ లాంటి సినిమా చేయాలని ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. మరి అయన కోసం ఇప్పుడు ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు అనేది చూడాలి.