×
Ad

MSVG: నయనతారకి దృశ్యం కథ చెప్పాడట అనిల్.. విన్న వెంటనే ఒప్పేసుకుందట.. లింక్ భలే సెట్ చేశాడు కదా!

దృశ్యం కథను చెప్పి మన శంకర వరప్రసాద్ గారు(MSVG) సినిమాకి నయనతారను ఒప్పించాడట అనిల్ రావిపూడి.

Anil Ravipudi interesting comments about mana shankara vara prasad garu movie

  • మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ
  • సినిమా ఆసక్తికర విషయాలు పంచుకున్న టీం
  • నయనతారకు దృశ్యం మూవీ కథను చెప్పాడట అనిల్ రావిపూడి

MSVG: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడురోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మెగాస్టార్ వింటేజ్ లుక్స్, పండక్కి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. చాలా ఏరియాలల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పెడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి డిమాండ్ ఉంది అనేది.

ఇదిలా ఉంటే, తాజాగా మన శంకర వరప్రసాద్ గారు(MSVG) సినిమా సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు చిత్ర యూనిట్. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్, వేంకటేశ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నేపధ్యంలోనే చిరంజీవి మాట్లాడుతూ.. నేను, నయనతార గాడ్ ఫాథర్ సినిమాలో అన్నాచెళ్ళుగా చేశాం. మళ్ళీ ఇందులో భార్యాభర్తలుగా అంటే ఆడియన్స్ ఒప్పుకుంటారా అనే డౌట్ రాలేదా నీకు అంటూ అనిల్ రావిపూడిని అడిగాడు.

Sreemukhi: యాంకర్ శ్రీముఖి సంక్రాంతి సంబురాలు.. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు

సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. లేదు.. ఎందుకంటే అంతకంటే ముందే సైరా సినిమాలో మీరు భార్యాభర్తలుగా నడిచారు. నిజానికి, ఈ సినిమా సమయంలో నయనతార చాలా బిజీగా ఉన్నారు. కానీ తనకి కథ చాలా బాగా నచ్చింది. చిరంజీవితో చేయాలనే కోరిక కూడా ఉంది. కానీ, డేట్స్ కుదరడం లేదు. ఎం చేద్దాం అనిల్ అని ఆవిడే నాకు కాల్ చేసింది. అప్పుడు నేను ఒకటే అన్నాను. మీరు ఒప్పుకుంటే హ్యాపీ మేడమ్. లేదంటే దృశ్యం సినిమాలో వెంకటేష్ చెప్పినట్టుగా అసలు నేను మిమ్మల్ని కలవలేదు. మీకు మన శంకర వరప్రసాద్ గారు సినిమా కథ చెప్పలేదు అని అనుకుంటాను అని చెప్పాను.

దానికి ఇంప్రెస్ అయిన నయనతార డేట్స్ సెట్ చేసుకొని మరీ ఈ సినిమా చేశారు అంటూ చెప్పుకొచ్చాడు అని రావిపూడి. అలా దృశ్యం సినిమాలోని కథను చెప్పి మన శంకర వరప్రసాద్ సినిమా కోసం నయనతారను ఒప్పించాడట అనిల్. దీంతో అనిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.