మహేష్ బాబుకి థ్యాంక్స్ చెప్పిన అనిల్ రావిపూడి ఫ్యామిలీ!

మహేష్ బాబు ఫ్యామిలీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ..

  • Publish Date - January 16, 2020 / 10:57 AM IST

మహేష్ బాబు ఫ్యామిలీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్‌ కా బాప్ గా నిలిచింది. అన్ని చోట్ల నుండి భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతుందీ చిత్రం.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులు మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబు  ఫ్యామిలీకి అనిల్ ఫ్యామిలీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. అనిల్‌కి సినిమా చేసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పారు.

ఈ వీడియోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యి, ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతూ.. కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది సరిలేరు నీకెవ్వరు.