Anil Sunkara
Anil Sunkara : మహేష్ బాబు కెరీర్లో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ మంచి సినిమా కూడా ఫ్లాప్ అయింది. అదే వన్ నేనొక్కడ్నే. సుకుమార్ దర్శకత్వంలో 2014 లో వచ్చిన వన్ నేనొక్కడ్నే సినిమా అప్పటి జనాలకు అర్ధం కాక ఫ్లాప్ అయింది. కానీ అదే సినిమా ఇప్పుడు క్లాసిక్ అంటున్నారు ప్రేక్షకులు.(Anil Sunkara)
తాజాగా వన్ నేనొక్కడినే సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also See : Divi : భీమవరం పొలాల్లో దివి సంక్రాంతి సంబరాలు.. ఫొటోలు వైరల్..
అనిల్ సుంకర మాట్లాడుతూ.. వన్ నేనొక్కడినే సినిమా యాక్షన్ సినిమా అనుకున్నారు జనాలు. ఆ టైంలో ఆయనకు ఉన్న ఇమేజ్ విషయంలో హీరోకు ఒక సమస్య ఉందనే కాన్సెప్ట్ తీసుకోలేకపోయారు జనాలు. నాకు కూడా చూడగానే అదే అనిపించింది. అది చాలా ఇష్టపడి తీసిన సినిమా. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు క్లిక్ అవుతుంది. ఆ సమయంలో ప్రమోషన్స్ లో ఇలాంటి కాన్సెప్ట్ అని ముందే చెప్తే బెటర్ అయ్యేదేమో.
అయితే కాన్సెప్ట్ రివీల్ చేస్తే ఓపెనింగ్స్ తగ్గుతాయేమో అనిపించి చెప్పలేదు. కమర్షియల్ సినిమా అనుకొనే జనాల్లోకి వెళ్ళింది ఆ సినిమా. సినిమా చూసాక మహేష్ బాబుని జనాలు ఇలా చూస్తారా అనే సందేహం కలిగింది నాకు. సెకండ్ హాఫ్ లో మహేష్ పర్ఫార్మెన్స్ ఏడిపిస్తాడు. అది ఎలివేట్ అయి హిట్ అవుతుంది అనుకున్నాను. కానీ రిజల్ట్ తేడా వచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమాకు పనిచేసిన వాళ్లంతా గర్వంగా ఫీల్ అవుతున్నాము అని తెలిపారు. వన్ నేనొక్కడినే సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే కనుక మంచి విజయం సాధించేది అని ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా అంటున్న సంగతి తెలిసిందే.