Animal Movie : యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్.. ఆ స్టార్ హీరోదట..
యానిమల్ సినిమాలో చూపించిన రణబీర్ కపూర్ ప్యాలస్.. ఒక బాలీవుడ్ స్టార్ హీరోదట. అతను ఎవరో తెలుసా..?
- gum 95921
- Published On : December 4, 2023 / 07:21 PM IST
Animal Movie Ranbir Kapoor palace owner is that bollywood star hero
Animal Movie : రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇక సోషల్ మీడియా టైం లైన్ అంతా.. యానిమల్ మూవీ ఫీడ్ తో నిండిపోతుంది. ఈక్రమంలోనే యానిమల్ సినిమాలో చూపించిన రణబీర్ కపూర్ ప్యాలస్.. ఒక బాలీవుడ్ స్టార్ హీరోదట.
మూవీలో రిచ్ లుక్ తీసుకు వచ్చిన ఆ ప్యాలస్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్దట. యానిమల్ లో చూపించిన ప్యాలెస్ సైఫ్ అలీఖాన్ కి చెందిన పటౌడీ ప్యాలెస్. వీరిది రాజ కుటుంబం. ఈ ప్యాలస్ పది ఎకరాల విస్తీర్ణంలో 150 రూమ్స్ కలిగి ఉంటుంది. ఇక దీని విలువ వచ్చి సుమారు 800 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం నార్త్ ఆడియన్స్ కి చాలా మందికి తెలుసు. కానీ సౌత్ ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Animal Movie : ఆమీర్ ఖాన్ ఓల్డ్ వీడియోతో ‘యానిమల్’ని ట్రోల్ చేస్తున్న బాలీవుడ్..
ఇక యానిమల్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండురోజు 120 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఓవర్ ఆల్ గా రెండు రోజుల్లో 236 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజు ఆదివారం దాదాపు 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకొని మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లో కొత్త రికార్డుని సృష్టించింది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ త్రీ డేస్ కలెక్షన్స్ ని యానిమల్ బీట్ చేసింది. గ్లోబల్ వైడ్ వీకెండ్ కలెక్షన్స్ కూడా ఈ చిత్రం నెంబర్ వన్ గా నిలిచింది.
