Mahavatar Narsimha : ‘హరిహర వీరమల్లు’ను దెబ్బ కొట్టిన యానిమేషన్ సినిమా..

హరిహర వీరమల్లు రిలీజయిన నెక్స్ట్ డే జులై 25న మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా రిలీజయింది.

Mahavatar Narsimha

Mahavatar Narsimha : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఇటీవల జులై 24న థియేటర్స్ లో రిలీజయిన సంగతి తెలిసిందే. కథ బాగున్నా స్క్రీన్ ప్లే, VFX బాగోకపోవడంతో ఈ సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. ముఖ్యంగా VFX విషయంలో బాగా విమర్శలు వచ్చాయి. అయితే విమర్శలు వచ్చిన సీన్స్ ని తొలగించి మళ్ళీ రిలీజ్ చేసారు హరిహర వీరమల్లు సినిమాని. మొదటి మూడు రోజులు ఫ్యాన్స్ వల్ల బాగానే నడించింది. ఈ సినిమాకు ఇప్పటివరకు దాదాపు 85 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం.

అయితే హరిహర వీరమల్లు రిలీజయిన నెక్స్ట్ డే జులై 25న మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా రిలీజయింది. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు. ఒక మాములు యానిమేషన్ సినిమా. భక్త ప్రహ్లాద కథతో తెరకెక్కింది. హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు.

Also See : Rashmika Mandanna : మైసా.. రష్మిక కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..

మహావతార్ నరసింహ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. యానిమేషన్ లో హిరణ్య కశ్యపుడి కథ, భక్త ప్రహ్లాద కథ అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా నరసింహ స్వామి వచ్చిన దగ్గర్నుంచి చివరి 20 నిమిషాలు గూస్ బంప్స్. థియేటర్స్ లో ఈ సినిమాని చుసిన వారు మౌత్ టాక్ ద్వారా సినిమా గురించి గొప్పగా చెప్తున్నారు. ఇంకేముంది ఈ సినిమాకు బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. మొదట చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజవ్వగా ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి థియేటర్స్ అమాంతం పెరిగాయి. సింగిల్ స్క్రీన్స్ కొన్ని హరిహర వీరమల్లు తీసేసి మరీ మహావతార్ నరసింహ సినిమాని వేస్తున్నారు.

వేసిన షోలు వేసినట్టు అన్ని మహావతార్ నరసింహ షోలు హౌస్ ఫుల్ బుక్ అవుతున్నాయి. మౌత్ టాక్ బాగుండటం, యానిమేషన్ సినిమా కాబట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్తుండటం, మన హిందూ చరిత్ర కావడంతో సినిమాకు అన్ని రకాలుగా కలిసొచ్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ యానిమేషన్ సినిమా హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్స్ మీద కొంత దెబ్బ కొట్టింది. మొత్తానికి ఒక సినిమా బాగుంటే, మంచి మౌత్ టాక్ వస్తే అది ఏ సినిమా అయినా జనాలు హిట్ చేస్తారని మహావతార్ నరసింహ నిరూపించింది. కేవలం తెలుగులోనే కాక పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజయి దూసుకుపోతుంది. ఈ సినిమాకు దాదాపు 5 కోట్ల బడ్జెట్ అవ్వగా ఇప్పటికే 12 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం.

మహావతార్ నరసింహ రివ్యూ ఇక్కడ చదవండి : Mahavatar Narsimha : ‘మహావతార్ నరసింహ’ మూవీ రివ్యూ.. భక్త ప్రహ్లాద కథ యానిమేషన్ లో..