Pawan Kalyan: పవన్ సినిమాకు నో చెప్పిన మ్యూజిక్ సెన్సేషన్.. ఆ గాయం ఇంకా మానలేదా..?

ప్రస్తుతం గతకొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. రాజకీయంగా మాత్రమే కాకుండా, సినిమా పరంగానూ పవన్ వరుస అప్డేట్స్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. ఇక తాజాగా ఆయన 20 ఏళ్ల తరువాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ షేర్ చేసిన ఫోటో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Anirudh Ravichander Rejects Pawan Kalyan Movie Offer

Pawan Kalyan: ప్రస్తుతం గతకొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. రాజకీయంగా మాత్రమే కాకుండా, సినిమా పరంగానూ పవన్ వరుస అప్డేట్స్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. ఇక తాజాగా ఆయన 20 ఏళ్ల తరువాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ షేర్ చేసిన ఫోటో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Pawan Kalyan: 20 ఏళ్ల తరువాత పవన్ మళ్లీ అలా చేస్తున్నాడుగా!

ఇక పవన్ కల్యాణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘హరిహరవీరమల్లు’ సినిమా షూటింగ్‌లో యమబిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తన నెక్ట్స్ చిత్రాలను కూడా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘OG’ అనే టైటిల్‌తో ఓ సినిమాను చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేయగా, దీనికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాకు సంగీతం అందించాలని యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను చిత్ర యూనిట్ కోరిందట.

Pawan Kalyan : హరిహర వీరమల్లు సెట్ నుంచి పవన్ తో ఫోటో పోస్ట్ చేసిన హారిష్ శంకర్.. వైరల్ అవుతున్న పిక్..

కానీ, ఆయన ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాక అనిరుధ్ సంగీతం అందించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో ఆ సినిమా తరువాత ఇప్పటివరకు అనిరుధ్ పవన్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం అనిరుధ్ తమిళంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో పాటు, తెలుగులోనూ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన పవన్ సినిమాకు సంగీతం అందించేందుకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక, ఈ సినిమాకు నో చెప్పాడట.