Anirudh Ravichander speech in Kingdom Pre Release Event
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన భాగశ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు చిత్ర బృందం అంతా హాజరు అయింది.
ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు అనిరుద్ తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ సినిమా రిలీజ్ కోసం తామంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సినిమా ఔట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. హీరో విజయ్ ఓ మంచి మనిషి అని, ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారన్నారు.
Vijay Deverakonda : అందరూ కోరుకున్న విజయం ఖాయం.. : విజయ్ దేవరకొండ
ఇక తాను కింగ్‌డమ్ చిత్రాన్ని చూశానని అనిరుధ్ చెప్పాడు. అందరి కెరీర్‌లో ఓ మైలు స్టోన్ మూవీగా నిలుస్తుందన్నాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేశామన్నాడు. ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తానని నమ్ముతున్నట్లుగా చెప్పాడు. ‘నన్ను మీవాడిగా భావించి నాపై ప్రేమ కురిపిస్తున్నారు. మీ ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు నా వాళ్లు అయిపోయారు. ‘ అని అనిరుధ్ అన్నాడు.