Anjali : గేమ్ ఛేంజర్ షూట్‌లో అంజలికి గాయం.. అయినా వచ్చి వేరే సినిమా కోసం ఐటెం సాంగ్..

'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా ప్రమోషన్స్ లో అంజలి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ గురించి మాట్లాడింది.

Anjali : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ సాగుతూనే ఉంది. ఇంకా రెండు నెలలు షూటింగ్ మిగిలి ఉందని, దీపావళికి గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తామని ఇటీవల దిల్ రాజు ఓ ఈవెంట్లో తెలిపారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తుంది.

అంజలి త్వరలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే సినిమాతో రాబోతుంది. గతంలో అంజలి చేసిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం అంజలి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంలో అలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చింది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో విడుదల చేశారు. ఇందులో అంజలి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ గురించి మాట్లాడింది.

Also Read : Vijay Deverakonda : ఆ జానర్‌లో మాత్రం నేను సినిమాలు చేయను.. విజయ్ దేవరకొండ నుంచి అలాంటి సినిమాలు రావా?

అంజలి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ షూట్ లో రోప్స్ ఎక్కువయి మజిల్ చిన్నగా గాయం అయింది. ఆ బాధతోనే మళ్ళీ తర్వాత రోజు ఇక్కడికి వచ్చి రారా రెడ్డి ఐటెం సాంగ్ షూట్ చేసాను అని తెలిపింది. అన్ని పాత్రలు కవర్ అవ్వాలనే ఐటెం సాంగ్ చేసాను అని చెప్పింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ భార్యగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఆ షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం.

 

ట్రెండింగ్ వార్తలు