anjana devi didnot attend to Varun Tej Lavanya Tripathi Marriage
VarunLav : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఏడడుగులు వేసి ఒకటి కాబోతున్నారు. ఇటలీలో గ్రాండ్ గా జరగబోయే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడికి చేరుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా అందరూ తమ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చేసి అక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ మొదలయ్యిపోయిన ఈ పెళ్లి వేడుక నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది.
నేడు అక్టోబర్ 30 రాత్రి సంగీత్ పార్టీ, అక్టోబర్ 31 ఉదయం హల్దీ వేడుకలు, సాయంత్రం మెహందీ వేడుక, నవంబర్ 1న పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకకు మెగా బ్రదర్స్ కన్నతల్లి, వరుణ్ తేజ్ నాయనమ్మ అంజనా దేవి వెళ్లడం లేదట. ప్రస్తుతం అంజనా దేవి బాధపడుతున్న ఆరోగ్య సమస్యతో ఆమె ప్రయాణించడం మంచిది కాదని డాక్టర్స్ పేర్కొన్నారట. దీంతో అంజనా దేవి మనవడి పెళ్లిని దగ్గర ఉండి చూసుకులేక పోతున్నారట. అయితే ఆమె ఆ పెళ్లిని ప్రత్యేక్షంగా వీక్షించడానికి చిరు ప్రత్యేక ఏర్పాట్లు చేశాడని సమాచారం.
ఇక పెళ్ళికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, పిల్లలు అకిరా-ఆద్య కూడా వెళ్లడం లేదు. తను వెళ్తే అక్కడ ఫ్యామిలీ అంతా అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని రేణు దేశాయ్ వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. ఇక నిహారిక పెళ్ళికి వెళ్లి అక్కడ సందడి చేసిన అకిరా-ఆద్య.. అన్నయ్య వరుణ్ పెళ్లి మాత్రం వెళ్లడం లేదట. పెళ్లి ఇటలీలో జరుగుతుండటంతో పిల్లల్ని కూడా పంపించట్లేదు రేణుదేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నవంబర్ 5న హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ లో అకిరా-ఆద్య కనిపించనున్నారు.